For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి పోటీ అతడే: ‘సూపర్ ప్లేయర్’ అంటూ గేల్ కితాబు

న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ భారత యువ ఆటగాడు లోకేష్ రాహుల్‌ను ఆకాశానికెత్తేశాడు. మూడు ఫార్మాట్లలో కెఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున రాహుల్‌తో కలిసి గేల్ ఆడిన విషయం తెలిసిందే.

మనదేశంలో ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో గేల్ పాల్గొని సందడి చేశాడు. తన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ సరదాగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా యూనివర్స్ బాస్‌గా పేరొందిన గేల్ టీఓఐతో మాట్లాడాడు.

'రాహుల్ సూపర్ ప్లేయర్. అతడు మూడు ఫార్మాట్లలో పరుగులు రాబట్టగలడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. విరాట్ కోహీకి రాహుల్ మంచి పోటీనిస్తాడు. అంతేగాక, ఫిట్నెస్ విషయంలోనూ ఎంతో శ్రమిస్తాడు. అతని శ్రమ అతడ్ని ఉన్నత స్థానాలకు చేర్చుతుంది' అని గేల్ ప్రశంసలతో ముంచెత్తాడు.

'Super player' KL Rahul will give Virat Kohli a tough competition: Chris Gayle

గత వారం క్రితం టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా రాహుల్‌ను ప్రశంసించాడు. ప్రపంచంలోనే తన ఆటను అతివేగంగా మెరుగుపర్చుకున్న ఆటగాడు రాహుల్ అని చెప్పుకొచ్చాడు. రానున్న కాలంలో టీమిండియాకు బలంగా మారనున్నాడని తెలిపాడు.

ఇటీవల జరిగిన వెస్టిండీస్‌తో జరిగిన తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు రాహుల్. 2016 ఐపిఎల్‌లో ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు. కాగా, తన ప్రతిభకు పదును పెడుతూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ అతి తక్కువ కాలంలోనే టీమిండియాకు కీలక బ్యాట్స్‌మన్‌గా రాహుల్ మారుతున్నాడంలో అతిశయోక్తి లేదేమో.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+