
వచ్చే ఏడాది ప్రపంచకప్..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. ఈ క్రమంలోనే అభిమానులు వచ్చే ప్రపంచకప్ గురించి చర్చ మొదలు పెట్టారు. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా 2024లో ఈ మెగా టోర్నీ జరగనుంది. అయితే ఈ టోర్నీలో సూపర్-12 దశలో ఆడే జట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయాయి.

సఫారీ విజయంతో నెదర్లాండ్స్..
ఆదివారం నాడు అద్భుతంగా ఆడిన నెదర్లాండ్స్ జట్టు సంచలన విజయం సాధించింది. బలమైన సౌతాఫ్రికా జట్టుకు షాకివ్వడమే కాదు.. ఆ జట్టును ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి పక్కకు నెట్టేసింది. దీంతో గ్రూప్-2 నుంచి భారత జట్టు నేరుగా సెమీస్ చేరగా.. బంగ్లాదేశ్‌పై విజయంతో పాకిస్తాన్ కూడా సెమీస్ చేరింది. అంతేకాదు, సఫారీలపై విజయంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించింది.

ఈ ఏడాది ఏం జరిగిందంటే..
వచ్చే టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో ఆడే జట్లు అన్నీ నిర్ధరణ అయిపోవడం గమనార్హం. మొత్తం ప్రపంచకప్‌లో 20 జట్లు పోటీ పడతాయి. అయితే ర్యాంకింగ్స్ కారణంగా ఈ ఏడాది కేవలం 8 జట్లే సూపర్-12కు నేరుగా అర్హత సాధించాయి. దీంతో క్వాలిఫైయర్లలో మెరుగ్గా రాణించిన నాలుగు జట్లు వీటితో చేరాయి. వచ్చే ఏడాది ఈ పరిస్థితి కనిపించేలా లేదు.

మొత్తం జట్లివే..
ఈ ప్రపంచకప్‌లో టాప్-8 జట్లు నేరుగా వచ్చే ప్రపంచకప్‌లో సూపర్-12కు అర్హత సాధించాయి. సఫారీలపై విజయంతో నెదర్లాండ్స్ కూడా ఈ జాబితాలో చేరింది. ర్యాంకింగ్స్ కారణంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా అర్హత సాధించాయి. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న కారణంగా యూఎస్, వెస్టిండీస్ కూడా సూపర్-12లో నేరుగా చేరాయి.
ప్రపంచకప్ ఆడే 12 జట్లివే: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఎస్ఏ, వెస్టిండీస్,


Click it and Unblock the Notifications












