న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికీ నన్నే టార్గెట్ చేస్తున్నారు: ట్రోల్ చేయడంపై మిథాలీ

Women's T20 Challenge : Mithali Raj Says 'Still They Are Targeting Me' || Oneindia Telugu
SUP vs VEL, Womens IPL T20 Challenge 2019: Mithali Raj says issue of low batting strike rate of other players isnt highlighted as much as hers

ఇతర క్రీడాకారిణులు స్ట్రైక్‌రేట్‌ ఇంకా పేలంగా ఉన్నా.. అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ భారత మహిళల క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి మిథాలీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మిథాలీ రాజ్‌ టీ20 స్ట్రైక్‌రేట్‌పై ఎప్పటినుండో చర్చ జరుగుతుంది. తాజాగా మహిళల టీ20 చాలెంజ్‌ సిరీ్‌సలో కూడా ఆ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మిథాలీ గురువారం ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించింది.

IPL 2019 Qualifier 2 CSK vs DC: కొత్త ఛాంపియన్‌ అవతరించేనా? IPL 2019 Qualifier 2 CSK vs DC: కొత్త ఛాంపియన్‌ అవతరించేనా?

నాలుగు డాట్‌బాల్స్‌ ఆడగానే ట్రోల్‌ చేస్తున్నారు:

నాలుగు డాట్‌బాల్స్‌ ఆడగానే ట్రోల్‌ చేస్తున్నారు:

'మహిళల ఐపీఎల్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చాలా మంది అమ్మాయిల స్ట్రైక్‌రేట్‌ వంద లోపే ఉంది. దాన్ని ఎవరైనా గమనించారా?.. లేదు. ఎందుకంటే వాళ్లలో మిథాలీ రాజ్‌ లేదు కాబట్టి' అని ఫైర్ అయ్యింది. 'తాజాగా ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో ఓ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌వుమన్‌ స్ట్రైక్‌రేట్‌ 50 మాత్రమే ఉంది. దీన్ని నేనేమైనా ప్రశ్నించానా? ఈ అంశాన్ని ఎవరైనా అడిగారా?. అయినా.. స్ట్రైక్‌రేట్‌ విషయంలో జనం నన్నే విమర్శిస్తున్నారు. నేను నాలుగు డాట్‌బాల్స్‌ ఆడగానే అంతా ట్రోల్‌ చేశారు' అని మిథాలీ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను కూడా ప్రశ్నించగలను:

నేను కూడా ప్రశ్నించగలను:

'నేను అత్యుత్తమ టీ20 క్రీడాకారిణిని అని చెప్పట్లేదు. నా ఆట గురించి నాకు తెలుసు. నా బ్యాటింగ్‌లో ఒక్క స్ట్రైక్‌రేట్‌ అంశంపైనే మాట్లాడడం సబబు కాదు. మీలాగా మాట్లాడితే.. నేను కూడా ప్రస్తుత జట్టులోని చాలా మందిని ప్రశ్నించగలను. కానీ నేను అలా చేయను. మాజీ కోచ్‌ పొవార్‌, సీఓఏ సభ్యురాలు ఎడుల్జీ వివాదం నుంచి బయటపడేందుకు ఇంకా సమయం పడుతుంది' అని మిథాలీ చెప్పుకొచ్చారు.

 ఫైనల్స్‌కు వెలాసిటీ:

ఫైనల్స్‌కు వెలాసిటీ:

ఐపీఎల్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా జైపూర్ వేదికగా గురువారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ నేతృత్వంలోని వెలాసిటీ జట్టు ఓడిపోయింది. అయినా మెరుగైన రన్‌రేట్‌తో వెలాసిటీ జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో మిథాలీ (40*; 42 బంతుల్లో 3×4) రాణించింది. ఇక ఫైనల్లో వెలాసిటీ, సూపర్‌నోవాస్‌ జట్లు తలపడనున్నాయి. స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టు తక్కువ రన్‌రేట్‌తో టోర్నీ నుండి నిష్క్రమించింది.

Story first published: Friday, May 10, 2019, 11:47 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X