For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ విజయం (Video)

సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సత్తాచాటుతోంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆదివారం పార్ల్ రాయల్స్‌‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అయిదు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 19.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.

అయితే 160 పరుగుల లక్ష్యం సన్‌రైజర్స్‌కు కష్టతరం కాదు. కానీ ఆఖరి లీగ్ మ్యాచ్ కావడంతో ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చారు. అంతేగాక సన్‌రైజర్స్ ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ మొదలుపెట్టడంతో మ్యాచ్ ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (21; 22 బంతుల్లో) ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 5.2 ఓవర్లకు 33/1. ఆ తర్వాత కూడా సన్‌రైజర్లు బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు.

Sunrisers won in thrilling match against Paarl Royals in SA20

పార్ల్ రాయల్స్ బౌలర్ల క్రమశిక్షణ బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌కు బౌండరీలు తక్కువగా వచ్చాయి. బవుమా (33; 30 బంతుల్లో), కెప్టెన్ మార్క్‌రమ్ (37; 27 బంతుల్లో) నిలకడగా ఆడటంతో విజయ సమీకరణం చివరి రెండు ఓవర్లలో 22 పరుగులుగా మారింది. అయితే 19వ ఓవర్ రెండో బంతికే దూకుడుగా ఆడే స్టబ్స్ (19; 12 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది.

కానీ ఈ దశలో క్రీజులోకి వచ్చిన పాట్రిక్ (26*; 7 బంతుల్లో) పార్ల్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అదే ఓవర్‌లో మరో సిక్సర్ సాధించి గెలుపు సమీకరణాన్ని ఆరు బంతుల్లో 8 పరుగులు మార్చాడు. అయితే సన్‌రైజర్స్‌కు విజయం అంత తేలికగా దక్కలేదు. చివరి ఓవర్ తొలి బంతికే బవుమా ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు బంతులకు మూడు పరుగులే రావడంతో ఉత్కంఠ మొదలైంది. కానీ ప్యాట్రిక్ వరుసగా ఫోర్, సిక్సర్ బాది జట్టును గెలిపించాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ జట్టులో బట్లర్ (38; 22 బంతుల్లో), డేన్ విలస్ (34; 25 బంతుల్లో) రాణించారు. కాగా, రేపు జరగనున్న క్వాలిఫయర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. బుధవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ పోటీపడనున్నాయి.

Story first published: Monday, February 5, 2024, 9:25 [IST]
Other articles published on Feb 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+