IPL 2023 : కప్పు కొట్టాలంటే వాళ్లు ఉండాలంటున్న కావ్య పాప..!

ఐపీఎల్ మినీ వేలానికి ముందు భారీగా పర్సు ఖాళీ చేసుకున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమేరియో షెఫర్డ్ వంటి ఆటగాళ్లను సన్‌రైజర్స్ వదిలేసుకుంది. దీంతో వేలానికి ముందు ఆ జట్టు వద్ద భారీగా డబ్బు సమకూరింది. దీంతో తమ జట్టులో ఉన్న లోపాలను భర్తీ చేసి, జట్టును మరింత బలంగా చేయగలిగే ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి కావ్య పాప ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే నలుగురు ఆటగాళ్లపై సన్‌రైజర్స్ యాజమాన్యం ఫోకస్ పెట్టిందట.

బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఎలాగైనా కొనేసి జట్టు కెప్టెన్‌గా నియమించాలని సన్‌రైజర్స్ చూస్తోంది. దీని కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడకూడదని అనుకుంటోందట. కేన్ విలియమ్సన్‌ను వదిలేసుకున్న తర్వాత జట్టుకు నాయకత్వం వహించే వాళ్లు లేకపోవడంతో వేలంలోనే కొత్త కెప్టెన్‌ను కొనాలని సన్‌రైజర్స్ నిర్ణయించింది. ఆ పాత్రకు స్టోక్స్ కన్నా బెటర్ ఆప్షన్ మరొకటి లేదని కావ్య మారన్ అండ కో భావిస్తోంది.

మయాంక్ అగర్వాల్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్‌ను ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. దీంతో అతను కూడా మినీ వేలంలో దిగాడు. విలియమ్సన్ లేకపోవడంతో టాపార్డర్‌లో ఏర్పడిన లోటును పూడ్చుకునేందుకు అగర్వాల్‌ను కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ అనుకుంటోంది. అలాగే ఏమైనా అటూ ఇటూ జరిగిన బెన్ స్టోక్స్‌ను కొనలేకపోతే మయాంక్‌ను కెప్టెన్ కూడా చేసే అవకాశం ఉంది. అయితే గతేడాది ఐపీఎల్‌లో మయాంక్ చాలా చెత్త ప్రదర్శన కబరిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. అసలు మయాంక్ మనకు అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆడమ్ జంపా
సన్‌రైజర్స్ బలమంతా పేస్ దళమే. జట్టులో నిఖార్సయిన స్పిన్నర్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ ఫర్వాలేదనిపిస్తున్నా అతనికి గాయాల బెడద ఎక్కువ. ఇలాంటి సమయంలో మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేసే స్పిన్నర్ కోసం సన్‌రైజర్స్ వెతుకుతోంది. అందుకే ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాను కొనుగోలు చేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో కూడా జంపా బాగానే రాణిస్తున్నాడు. అవసరం అయితే జట్టుకు నాయకత్వం వహించే సత్తా కూడా జంపాకు ఉంది.

అదిల్ రషీద్
పొట్టి ఫార్మాట్‌లో బెస్ట్ స్పిన్నర్లలో ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఒకడు. అందుకే అతన్ని కూడా టార్గెట్ చేయాలని కావ్య మారన్ భావిస్తోంది. అతను కూడా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలరే. అందుకే జంపా, రషీద్ ఉంటే జట్టులో స్పిన్ బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంటుందని సన్‌రైజర్స్ నమ్ముతోంది. టీ20 వరల్డ్ కప్‌లో కూడా అదిల్ రషీద్ రాణించాడు. భారత్‌తో జరిగిన సెమీఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీసి టీమిండియాను బలమైన దెబ్బతీసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications