For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : వేలంలో ఈ బిగ్ హిట్టర్లు.. కావ్య పాప కొనకుండా ఉంటేనే బెటర్..!

Sunrisers should not buy these three players

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలన్నీ తాము ఎవరెవర్ని కొనుగోలు చేయాలని మంతనాలు చేస్తున్నాయి. ఈ వేలంలో భారీ పర్సుతో బరిలో దిగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కొందరు ఆటగాళ్లను టార్గెట్ చేస్తుంది. అయితే కొంత మంది బిగ్ హిట్టర్లు ఈ వేలంలో హైలైట్‌గా నిలవనున్నారు.

కానీ వీళ్ల విషయంలో సన్‌రైజర్స్ యాజమాన్యం, కావ్య మారన్ తొందర పడకుంటే బెటర్ అని విశ్లేషకుల మాట.

ఒడియన్ స్మిత్

ఒడియన్ స్మిత్

గతేడాది పంజాబ్ కింగ్స్ జట్టు వెస్టిండీస్ నయా సంచలనం ఒడియన్ స్మిత్‌ను మంచి ధరకు కొనుగోలు చేసింది. కానీ అతను పెద్దగా రాణించకపోవడంతో మినీ వేలం ముందు విడుదల చేసేసింది. అదే సమయంలో సన్‌రైజర్స్ జట్టు అతన్ని కొనుగోలు చేయడానికి టెంప్ట్ అవ్వొచ్చు. ఎందుకంటే ఈ జట్టులో ఉమ్రాన్ మాలిక్, మహా అయితే కార్తీక్ త్యాగి తప్ప మిగతా పేసర్లు ఎవరూ 145+ కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం కష్టం. స్మిత్ ఇలా వేగంగా బౌలింగ్ చేయగలడు. దానికితోడు లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు కూడా ఆడగలడు. కానీ ఐపీఎల్‌లో అతని ఎకానమీ 11.87. అలాగే పంజాబ్ తరఫున అతను కేవలం 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతకుముందు రొమేరియో షెఫర్డ్ విషయంలో జరిగిన మిస్టేక్ మళ్లీ జరగకూడదంటే సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ స్మిత్‌ను ఎవాయిడ్ చేయడమే కరెక్ట్.

జేసన్ రాయ్

జేసన్ రాయ్

కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేయడంతో సన్‌రైజర్స్‌కు అర్జెంటుగా ఒక ఓపెనర్ అవసరం ఏర్పడింది. దీంతో ఒకప్పుడు సన్‌రైజర్స్ తరఫున ఆడిన జేసన్ రాయ్‌ను కొనేందుకు ఈ ఫ్రాంచైజీ టెంప్ట్ అవ్వొచ్చు. ఈ ఫార్మాట్‌లో రాయ్ ఎంతటి విధ్వంసకర బ్యాటరో అందరికీ తెలిసిందే. అందుకే మరోసారి అతన్ని కొనేందుకు సన్‌రైజర్స్ ఇంట్రస్ట్ చూపించొచ్చు. కానీ ఇటీవలి కాలంలో రాయ్ అసలు ఫామ్‌లో లేడనే విషయం మర్చిపోకూడదు. దానికితోడు వేలంలో పేరు నమోదు చేసుకున్నా కూడా చాలా సార్లు అతను ఐపీఎల్ ఆడకుండా తప్పుకున్నాడు. కానీ ఇటీవల అబుధాబి టీ10 లీగులో అతను కొంత రాణించాడు. దీంతో సన్‌రైజర్స్ అతన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే అతను ఇంత చెత్త ఫామ్‌లో ఉన్న రాయ్‌ను కొనుగోలు చేసి లేని తలనొప్పులు తెచ్చుకోవడం సన్‌రైజర్స్‌కు మంచిది కాదు. అతని బదులు కామెరూన్ గ్రీన్ వంటి కొత్త మొఖాలను వెతుక్కోవడం బెటర్.

కేన్ విలియమ్సన్

కేన్ విలియమ్సన్

గతేడాది రూ.14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ రిలీజ్ చేసేసింది. అతను తన ధరకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. పవర్‌ప్లేలో నిదానంగా ఆడుతూ మిగతా బ్యాటర్లపై కూడా ఒత్తిడి పెంచాడు. అయితే అతన్ని రిలీజ్ చేసిన సన్‌రైజర్స్ మరో కెప్టెన్ పేరు ప్రకటించలేదు. దీంతో అతన్ని మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేసి సన్‌రైజర్స్ పగ్గాలు అందిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా చేయడం వల్ల సన్‌రైజర్స్‌కు పెద్దగా ఒరిగేదేం లేదు. అతని బ్యాటింగ్, కెప్టెన్సీ కూడా ఇటీవలి కాలంలో మరుగున పడిపోయింది. కాబట్టి మళ్లీ విలియమ్సన్‌ను కొనుగోలు చేయకుండా కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవడం బెటర్. లేదంటే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో ఎవరైనా ఒకరిని కెప్టెన్ పదవికి ప్రమోట్ చేయడం మరింత మంచి ఆప్షన్.

Story first published: Sunday, December 18, 2022, 20:26 [IST]
Other articles published on Dec 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+