For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : కావ్యపాపే కరెక్ట్.. వీళ్లు జట్టులో ఉంటే కప్పు ఎలా కొడతారు?

Sunrisers releasing these players is the best move hails fans

ఐపీఎల్ మినీ వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే జట్లన్నీ కూడా తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలను సమర్పించేశాయి. ఇలాంటి సమయంలో సన్‌రైజర్స్ జట్టు కూడా అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. విండీస్ విధ్వంసకారుడు నికోలస్ పూరన్ సహా పలువురు కీలక ఆటగాళ్లను తాము రిలీజ్ చేసినట్లు సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ వెల్లడించింది. ఈ క్రమంలో ముగ్గురు ఆటగాళ్లను వదిలేసి ఆమె చాలా మంచి పని చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్లెవరో ఒకసారి చూస్తే..

షాన్ అబాట్

షాన్ అబాట్

ఆస్ట్రేలియా పేసర్ షాన్ అబాట్‌ను సన్‌రైజర్స్ వదిలేయడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున అబాట్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దానిలో కూడా 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బంతితో, బ్యాటుతోనూ రాణించగల సత్తా అబాట్‌కు ఉంది. కానీ ఐపీఎల్ జట్టు ఆధారపడగలిగే అంత ప్రతిభ అబాట్‌లో కనబడటం లేదు. ఆసీస్ టీ20 జట్టులోకి వస్తూ పోతూ ఉండే అతను అక్కడ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. దీనికితోడు సన్‌రైజర్స్ వద్ద మరిన్ని పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే వేలంలో మరో మంచి ఆల్‌రౌండర్ కోసం వెళ్లాలన్నా అబాట్‌ను వదిలించుకోవడమే బెటర్.

రొమేరియో షెఫర్డ్

రొమేరియో షెఫర్డ్

గతేడాది వేలంలో తాము కొనాలని అనుకున్న బిగ్ హిట్టర్లంతా అమ్ముడుపోవడంతో తొందరపాటుతో విండీస్ ప్లేయర్‌ రొమేరియో షెఫర్డ్‌ను సన్‌రైజర్స్ కొనేసింది. అతని కోసం ఏకంగా రూ.7.75 కోట్లు ఖర్చు పెట్టింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున మూడు మ్యాచులు ఆడిన అతను మూడు వికెట్లు తీసుకొని, మొత్తమ్మీద 58 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో పెద్దగా సత్తా చూపలేకపోవడమే కాకుండా, జట్టుకు లోయర్ ఆర్డర్‌లో కావలసినంత విధ్వంసాన్ని అందించడంలో కూడా విఫలమయ్యాడు. అందుకే తెలివిగా కావ్య అతన్ని వదిలించుకుంది. ఈసారి కూడా షెఫర్డ్‌కు మరో ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరికే అవకాశం ఉంది. కానీ అంత భారీ మొత్తం మాత్రం లభించదు.

కేన్ విలియమ్సన్

కేన్ విలియమ్సన్

మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేయడమే. ఆ జట్టు బడ్జెట్‌లో రూ.14 కోట్లు తీసుకున్న కేన్ మామ.. బ్యాటుతో చాలా నెమ్మదైన ఆరంభాలు అందించాడు. ఈ ఫార్మాట్‌లో పెద్దగా రాణించని విలియమ్సన్‌ను వదిలేసుకొని మరెవరైనా విదేశీ ప్లేయర్‌ను కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ డిసైడ్ అయింది. అయితే కెప్టెన్‌గా మంచి తెలివితేటలు ఉన్న విలియమ్సన్‌ను వదులుకోవడం రిస్క్‌తో కూడుకున్నదే అయినా.. టీ20 ఫార్మాట్‌లో కేవలం తెలివితేటలే మ్యాచులు గెలిపించవు కదా. జట్టుకు అవసరమైన ఆటతీరు కూడా ఉండాలి. అందుకే విలియమ్సన్‌ను వదిలేసినా సన్‌రైజర్స్‌పై ఎలాంటి విమర్శలు రాలేదు.

Story first published: Tuesday, December 13, 2022, 18:25 [IST]
Other articles published on Dec 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+