Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aiden Markram : ఆఫీసు జాబ్ చేయడాన్ని కలలో కూడా ఊహించబోను.. రాపిడ్ ఫైర్‌లో ఆసక్తికర విషయాలు

Sunrisers Player Aiden Markram says he never dreamed of doing any office job

దక్షిణాఫ్రికా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఐడెన్ మార్క్‌రామ్ తన ఇష్టాఇష్టాలను సన్ రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ టీం అడిగిన రాపిడ్ ఫైర్‌లో పంచుకున్నారు. ఒకవేళ గతంలోకెళితే దివంగత షేన్ వార్న్‌ బౌలింగ్ ఎదుర్కోవడాన్ని తాను ఇష్టపడేవాడినని తెలిపాడు. తన ఇష్టమైన బ్యాటర్ గురించి మార్కరమ్ చెబుతూ.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ అని ప్రస్తావించాడు. మార్క్రామ్ సన్ రైజర్స్ జట్టులో తన సహచరులయిన వాషింగ్టన్ సుందర్, టి.నటరాజన్ నైస్ పర్సన్స్ అని పేర్కొన్నాడు. తను ఒకవేళ క్రికెటర్‌ కాకపోతే.. సఫారీ లేదా ట్రావెల్ గైడ్‌లో తన కెరీర్‌ కొనసాగించేవాడినని తెలిపాడు. తాను అకౌంటెంట్‌గా లేదా మరేదైనా ఆఫీస్ జాబ్‌ చేయడాన్ని కనీసం కలలో కూడా ఊహించను కూడా ఊహించబోనని పేర్కొన్నాడు.

ఇకపోతే దక్షిణాఫ్రికా టీంలో క్వింటన్ డికాక్‌ చాలా సరదా ప్లేయర్ అని చెప్పాడు. ఇక ఆరెంజ్ ఆర్మీలో ఎవరూ సరదా పర్సన్ అని అడిగినప్పుడు వెస్టిండీస్ వన్డే, టీ20 కెప్టెన్ అయిన నికోలస్ పూరన్‌ పేరు ప్రస్తావించాడు. ఇకపోతే ప్రతిసారి బస్ మిస్సయ్యే ప్లేయర్‌గా మార్కో జాన్సెన్‌ గురించి చెప్పాడు. సీనియర్ భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించి ఏమైనా చెప్పాలని అడగ్గా.. చాలా క్లెవర్ పర్సన్ అని తెలిపాడు. ఇక తన అభిమాన నటుడి గురించి అడిగినప్పుడు.. ప్రముఖ అమెరికన్ నటుడు ఆడమ్ శాండ్లర్ అని, కేప్ టౌన్‌ తన ఫేవరెట్ సిటీ అని చెప్పాడు.

ఇక ఐపీఎల్లో మార్క్‌రమ్ సన్ రైజర్స్ తరఫున మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్లో మిడిలార్డర్‌ను బలోపేతం చేశాడు. ఆరెంజ్ ఆర్మీ కోసం ఈ స్టైలిష్ బ్యాటర్ కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన మార్కరమ్ 4వ స్థానంలో బరిలోకి దిగి 381పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 139గా ఉండడం గమనార్హం. ఇకపోతే ఐపీఎల్లో మొత్తం 20మ్యాచ్‌లు ఆడిన ఐడెన్ మార్కరమ్.. 40.54సగటుతో 527 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు ఒక వికెట్ కూడా తీశాడు.

Story first published: Sunday, June 5, 2022, 16:11 [IST]
Other articles published on Jun 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+