Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగళూరు ఓటమికి అసలు కారణం 'కోహ్లీ'..!!

బెంగళూరు: ఐపీఎల్ పైనల్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయానికి పలు కారణాలు చెబుతున్నారు. తాను, డివిల్లీయర్స్ త్వరగా అవుట్ కావడం దెబ్బతీసిందని కోహ్లీ చెప్పాడు.

అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమికి అసలు కారణం వేరే ఉందని బెంగళూరు అభిమానులు, సెంటిమెంట్ బాగా నమ్మేవారు భావిస్తున్నారు. మ్యాచ్ ఓటమికి కారణం విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ కారణమని సెంటిమెంట్ అభిమానులు కొందరు భావిస్తున్నారు.

Sunrisers Hyderabad win IPL 2016: Twitterati hail Warner's captaincy, salute Kohli's consistency

ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఈ ఆరెంజ్ క్యాప్ ధరించిన బ్యాట్సుమెన్ వ్యక్తిగత స్కోర్ పరంగా రాణించినా జట్టు మాత్రం గెలవదంటున్నారు. ఈ సెంటిమెంట్ గతంలో సచిన్ టెండుల్కర్, షాన్ మార్ష్ తదితరుల వి,యంలో నిజమైందని అంటున్నారు. ఇప్పుడు కోహ్లీ విషయంలోను మళ్లీ రుజువైందంటున్నారు సెంటిమెంట్ బలంగా నమ్మేవారు.

ఇదిలా ఉండగా, ఐపీఎల్ ఆద్యంతం రాణించిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాజిక అనుసంధాన వేదికలలో వీరిద్దరిని అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లీ, వార్నర్‌లు తమ తమ జట్లను ఒంటిచేత్తో గెలిపిస్తూ ఫైనల్ దాకా తెచ్చారు. వార్నర్ కెప్టెన్సీ బాగుందని, కోహ్లీ నిలకడ అద్భుతమని చెబుతున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+