
ఎస్ఆర్‌హెచ్‌తో పాటు
ఈ దఫా ఈ వేలంపాటలో 10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోతోన్నాయి. క్రికెటర్ల పంట పండించనున్నాయి. ఐపీఎల్ 2022 మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి. పాత ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి.

కేన్ మామకు తోడు ఎవరు?
రిటైనింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో- ఒక్కో జట్టులో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరనున్నాయి. మెగా వేలంపాట రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ గోల్డెన్ ఛాన్స్ లభించింది. జట్టు మొత్తాన్నీ పునర్వ్యవస్థీకరించడానికి అద్భుతమైన అవకాశం లభించింది. ప్రస్తుతం సన్‌రైజర్స్‌లో కేప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే కొనసాగుతున్నారు. ఈ ముగ్గురినీ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంది. జట్టు మొత్తాన్నీ పునర్వ్యవస్థీకరించనుంది. కొత్త ముఖాలను జట్టులోకి తీసుకోనుంది.

స్టార్లకు దూరంగా..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పిసినారి ఫ్రాంఛైజీ అనే పేరుంది. తక్కువ ధరకే ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. స్టార్ ప్లేయర్లకు కూడా ఈ ఫ్రాంఛైజీ దూరంగా ఉంటుందనే పేరుంది. ఇదివరకు ఈ జట్టులో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, మిఛెల్ మార్ష్ మినహాయిస్తే.. చెప్పుకోదగ్గ స్టార్ ప్లేయర్లు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ జట్టును విజయతీరాలకు చేర్చదగ్గ ఆటగాళ్లు ఉండేవారు కాదు.

జట్టును బలోపేతం చేయడానికి..
ఫలితంగా గెలిచే మ్యాచ్‌ను కూడా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మెగా వేలంపాట రూపంలో ఓ మంచి అవకాశం లభించిందా జట్టుకు. కొత్త ముఖాలను తీసుకోవడానికి ఇదే మంచి సమయం. రిటైన్ చేసుకున్న వారిలో కేన్ విలియమ్సన్ ఒక్కటే స్టార్ ప్లేయర్. మిగిలిన ఇద్దరూ అన్ క్యాప్డ్ ప్లేయర్లే. శనివారం బెంగళూరులోని ఐటీసీ గార్డెనియాలో నిర్వహించబోయే వేలంపాట సందర్భంగా మంచి ఆటగాళ్లను తీసుకుంటే- ఈ జట్టుకు తిరుగుఉండదు.

ఆ వ్యాపార సూత్రం వర్తించదిక..
ఆల్‌రౌండర్లను తీసుకోవాలీ అంటే.. దానికి తగ్గట్టుగానే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ- ఆటగాళ్లపై కోట్ల రూపాయలను గుమ్మరిస్తుందా? అంటే అనుమానమే. తక్కువ పెట్టుబడి- అధిక లాభం అంటే కుదరకపోవచ్చు. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు- చేసే ఖర్చుపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయనడంలో సందేహాలు అక్కర్లేదు. అన్‌క్యాప్డ్ ప్లేయర్లతోనే ప్రయోగాలను సిద్ధపడితే మాత్రం ఎప్పట్లాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అపజయాలను పలకరించవచ్చు.

ఖర్చు చేస్తేనే..
రిటైన్ చేసుకున్నందుకు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు 14 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఇక అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌కు నాలుగు కోట్ల రూపాయల చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఇంకా 68 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఖర్చుచేస్తే మాత్రం మెరికల్లాంటి ప్లేయర్లు జట్టులో రావడం ఖాయం. పిసినారితనాన్ని ప్రదర్శించి- తక్కువ మొత్తంలో అన్ క్యాప్డ్ లేదా ఫామ్‌లో లేని క్రికెటర్లను తీసుకుంటే చేతులు కాల్చుకునే అవకాశం లేకపోలేదు.


Click it and Unblock the Notifications












