న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ నివేదిక వచ్చాకే వార్నర్‌పై చర్యలు: కెప్టెన్ రేసులో ధావన్, విలియమ్సన్

By Nageshwara Rao
Ball Tampering : David Warner Set To Lose Sunrisers Hyderabad Captaincy
Sunrisers Hyderabad to wait for Cricket Australia decision on David Warner: VVS Laxman

హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియా నివేదిక వచ్చిన తర్వాతే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై చర్యలు తీసుకుంటామని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఆసీస్ బాల్ టాంపరింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా ఎలా పట్టుకున్నారంటే!ఆసీస్ బాల్ టాంపరింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా ఎలా పట్టుకున్నారంటే!

బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ అంగీకరించడంతో ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం స్టీవ్ స్మిత్‌ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ పదవి నుంచి స్వతహాగా తప్పుకోవడంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌గా రహానేను ఆ జట్టు ఫ్రాంఛైజీ నియమించింది.

బాల్ టాంపరింగ్‌ కారణంగా వైస్ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలగిన డేవిడ్ వార్నర్‌పై ఐసీసీ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే, సన్‌‌రైజర్స్ యాజమాన్యం మాత్రం అతన్ని కెప్టెన్ హోదా నుంచి తప్పించే యోచనలో ఉంది. అతడి స్థానంలో కెప్టెన్ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో జట్టు యాజమాన్యం చర్చలు జరుపుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ రేసులో ప్రథమంగా శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. 'కేప్‌టౌన్ టెస్ట్‌లో జరిగింది చాలా దురదృష్టకరమైన ఘటన, ఇప్పుడు ఈ విషయంపై సన్‌రైజర్స్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం కోసం మేం ఎదురు చూస్తాం' అని అన్నాడు.

ఇక వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే.. అతని స్థానంలో ఎవరికి కెప్టెన్సీ ఇస్తారనే ప్రశ్నకు గాను 'ఘటన జరిగి రెండు రోజులు మాత్రమే అయింది. దానిపై విచారణ కూడా జరుగుతుంది. వార్నర్ చాలా గొప్ప ఆటగాడు అతని విషయంలో తొందరపాటులో నిర్ణయాన్ని తీసుకోలేం' అని లక్ష్మణ్ చెప్పాడు.

బాల్ టాంపరింగ్‌పై పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తాంబాల్ టాంపరింగ్‌పై పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తాం

బాల్ టాంపరింగ్ వివాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కి ముందే విచారణ పూర్తి చేస్తామని తెలిపారు. అయితే, ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్‌ ఇంకా దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు.

సీఏ అధికారులు దీనిపై విచారించేందుకు దక్షిణాఫ్రికా వచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు స్మిత్‌ దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిపారు. అంతేకాదు ఈ విచారణ పూర్తయ్యే వరకూ ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఎవరూ దక్షిణాఫ్రికా దాటి వెళ్లకూడదు అని ఆదేశాలు జారీ చేసింది.

'క్రికెట్ ఆస్ట్రేలియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రతి ఆస్ట్రేలియా ఆటగాళ్లు అక్కడే ఉండాలని ఆదేశింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం కొందరు ఆటగాళ్లు తమ స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ సీఏ విచారణ పూర్తైయ్యే వరకూ సౌతాఫ్రికా వదిలి వెళ్లడానికి వీల్లేదు' క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.

Story first published: Monday, March 26, 2018, 20:45 [IST]
Other articles published on Mar 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X