ఐపీఎల్‌లో పొరబాట్లు: ఒకే ఓవర్‌లో ఏడు బంతులు

Posted By:
 Sunrisers Hyderabad vs Rajasthan Royals: As it happened

హైదరాబాద్: ఒకే ఓవర్లో ఏడు బంతులను వేయించిన ఘనతను నమోదు చేసుకున్నారు ఐపీఎల్ అంపైర్లు! సోమవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. ఒకే ఓవర్‌లో 7 బంతులు వేయించారు. ఈ విషయాన్ని క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బహిర్గతం చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన లాలిన్‌‌.. ఫీల్డ్ అంపైర్ల తప్పిదం కారణంగా ఏడు బంతులు వేయాల్సి వచ్చింది.

థర్డ్ అంపైర్‌ కూడా ఇలాంటి తప్పిదాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇలాంటి తప్పులు కొన్ని మ్యాచ్‌ల్లో ఎక్కువ మ్యూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది' అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. 15.5 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని 127/1తో ఛేదించేసింది.

ఆ ఎక్స్‌ట్రా బంతికి ధావన్ ఒక పరుగు రాబట్టాడు. అయితే.. అప్పటికే 126 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 103/1తో గెలుపు దిశగా సాగుతుండటంతో.. మ్యాచ్‌పై ఈ బంతి ప్రభావం పడలేదు. కానీ.. చివరి ఓవర్‌లో ఫలితం తేలే మ్యాచ్‌లకి పెట్టిందిపేరైన ఐపీఎల్‌ ఇలాంటి తప్పిదాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.

పని చేయని ఎల్‌ఈడీ బోర్డు:
ఉప్పల్‌ స్టేడియంలోని ఎల్‌ఈడీ స్కోరు బోర్డు సోమవారం ప్రేక్షకుల్ని అయోమయానికి గురిచేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో స్కోరు బోర్డు కాస్త వెనుకబడింది. సన్‌రైజర్స్‌ విజయానికి మరో 3 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా.. మైదానంలో మాత్రం 113/1 అని స్కోరు చూపించింది. 16వ ఓవర్‌ నడుస్తుండగా.. 13వ ఓవర్‌ చూపించడంతో ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 13:05 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి