IPL 2023: మరో కెప్టెన్‌ను వదిలేసిన కావ్య పాప.. అతనికే సన్‌రైజర్స్ ఛాన్స్?

ఐపీఎల్‌లో మినీ వేలానికి ముహూర్తం ఖరారైంది. జట్లన్నీ తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆయా జట్లు చాలా మంది ఆటగాళ్లను వదులుకున్నాయి. దీంతో ఈ మినీ వేలంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. పేరుకే మినీ వేలం అయినా.. భారీగానే జరిగేలా కనిపిస్తోంది.

చాలామందిని వదులుకున్న సన్‌రైజర్స్
మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా మంది కీలక ఆటగాళ్లను వదులుకుంది. డేవిడ్ వార్నర్‌ను కాదని 2019లో కెప్టెన్ చేసిన కేన్ విలియమ్సన్‌ను, అలాగే భారీ ధరకు కొనుగోలు చేసిన విండీస్ స్టార్ నికోలస్ పూరన్‌ను కూడా వదిలేసింది. కేవలం విదేశీయులనే కాదు అబ్దుల్ సమద్ వంటి భారత ఆటగాళ్లపై కూడా వేటు వేసింది. ఇలా మొత్తం 12 మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

భారీ పర్స్‌తో వేలానికి..
సన్‌రైజర్స్ జట్టు వదులుకున్న ఆటగాళ్లు ఖరీదైన వాళ్లు. వారిని భారీ ధరకు మెగావేలంలో కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ యాజమాన్యం. కేన్ విలియమ్సన్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకోగా.. పూరన్ ధర రూ.10.75 కోట్లు కావడం గమనార్హం. వీళ్లిద్దరి నుంచే సుమారు రూ.25 కోట్లు ఆదా చేసుకున్నారు సన్‌రైజర్స్ యాజమాని కావ్య అండ్ కో. వీరితపాటు రిలీజ్ చేసిన మిగతా ఆటగాళ్ల ద్వారా మరో రూ.20 కోట్ల వరకు మిగుల్చుకుంది. తద్వారా మొత్తం రూ.42.25 కోట్లతో వేలానికి వెళ్తోంది కావ్య.
భువీనే కెప్టెనా?
డేవిడ్ వార్నర్‌ను కఠినంగా తొలగించి కేన్ విలియమ్సన్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించిన సన్‌రైజర్స్.. మరోసారి సారధిపై వేటు వేసింది. జట్టుకు సరైన ఆరంభాలు అందించడంలో విఫలం అవడమే కాకుండా.. వ్యూహాత్మకంగా కూడా విజయాలు అందించలేకపోయిన విలియమ్సన్‌ను వదిలేసింది. దీంతో సన్‌రైజర్స్ తర్వాతి సారధి ఎవరనే చర్చ మొదలైంది.
దీనిపై ప్రముఖ కామెంటేటర్, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. 'సన్‌రైజర్స్ తర్వాతి కెప్టెన్ భువీనా?' అని ట్వీట్ చేశాడు. మరి కావ్య అండ్ కో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications