Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్, వార్నర్ ఆడుకున్నారు: కోహ్లీ సేనకు షాకిచ్చారు

బెంగళూరు: ఐపీయల్ 8లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఖాతా తెరిచింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో సునాయసంగా విజయం సాధించింది. తొలుత బౌలింగులో రాణించడంతో హైదరాబాద్‌కు విజయం దక్కింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' డేవిడ్‌ వార్నర్‌ (27 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్‌) దూకుడు ప్రదర్శించారు. దాంతో బెంగళూరు నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ అలవోకగా ఛేదించింది.

లోకేష్‌ రాహుల్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 44 నాటౌట్‌) మంచి సహకారం అందించాడు. దీంతో హైదరాబాద్‌ మరో 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

David Warner

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఏబీ డివిల్లీర్స్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46), విరాట్‌ కోహ్లీ (37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) మాత్రమే రాణించారు. క్రిస్‌ గేల్‌ (16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 21) పెద్దగా రాణించలేదు.

18 ఓవర్లకి 152/5తో పటిష్ట స్థితిలో ఉన్న బెంగళూరును ట్రెంట్‌ బౌల్ట్‌ (3/36), భువనేశ్వర్‌ (2/30) దెబ్బకొట్టారు. ఈ ఇద్దరూ చివరి 11 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టారు. దీంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలకు గండి పడింది. తొలి ఓవర్లోనే సిక్స్‌ బాది సవాల్ విసిరిన గేల్‌ను ప్రవీణ్‌ కుమార్‌ అవుట్‌ చేశాడు. గేల్‌ అవుటైన తర్వాత కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ (9) నిదానంగా ఆడడంతో స్కోరు వేగం తగ్గింది. అయితే ప్రవీణ్‌ వేసిన పదో ఓవర్లో 4, 6 బాదిన కోహ్లీ ఇన్నింగ్స్‌కు మరోసారి ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్లోనే కార్తీక్‌ అవుటయ్యాడు. అతని స్థానంలో వచ్చిన డివిల్లీర్స్‌ భారీ షాట్లు ఆడుతూ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.

హాఫ్‌ సెంచరీకి చేరువైన కోహ్లీ బొపారా వేసిన బంతికి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ మరుసటి బంతికే మన్‌దీప్‌ సింగ్‌ (0) డకౌటయ్యాడు. దీంతో బెంగళూరు ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఈ దశలో డివిల్లీర్స్‌ డారెన్‌ సామి (9), సీన్‌ అబాట్‌ (14) అండగా జట్టు స్కోరును 150 దాటించాడు. అయితే బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తొలి బంతిని బౌండ్రీకి తరలించిన డివిల్లీర్స్‌ ఆ తర్వాతి బాల్‌కే ధావన్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ ఓవర్లోనే అబాట్‌, హర్షల్‌ పటేల్‌ (2) కూడా పెవిలియన్‌కు చేరారు. ఆఖరి ఓవర్లో భువనేశ్వర్‌ కూడా వరుణ్‌ ఆరోన్‌ (6), అబు నెచిమ్‌ (4)లను బౌల్డ్‌ చేయడంతో బెంగళూరు ఆలౌటైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+