Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల సందడి

Sunrisers Hyderabad Team play cricket With Orphan School Childrens, Hyderabad

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఓ క్రికెట్‌ అకాడమీలో పిల్లలతో క్రికెట్‌ ఆడారు. సన్ టీవి నెట్ వర్క్ , ఖుషీ టీవి ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని ఓ క్రికెట్‌ అకాడమీకి సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు చేరుకొని అక్కడి చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు.

పిల్లలకు క్రికెట్‌ మెలకువలు నేర్పించడంతో పాటు బౌలింగ్‌ కూడా చేశారు. ఈ క్రమంలో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ బ్యాటింగ్‌ చేశాడు. అనంతరం వారు మాట్లాడుతూ .. చాలా మంది క్రికెట్‌ కెరీర్‌ గల్లీలోనే మొదలవుతుంది. మేం కూడా చిన్న వయసులో గల్లీ క్రికెట్‌ ఆడాం. ఇప్పుడు ఇలా పిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడటం చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియ‌మ్స‌న్‌, అభిషేక్ శర్మ, విజయ్‌శంకర్, శ్రీ వత్స గోస్వామి, రషీద్‌ ఖాన్, మహ్మద్‌ నబీ, బెయిర్‌స్టో, బిల్లీ స్టాన్‌లేక్, నయీం తదితరులు పాల్గొన్నారు.

Story first published: Wednesday, April 17, 2019, 16:50 [IST]
Other articles published on Apr 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+