Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: వరల్డ్ కప్ టీంలో సన్‌రైజర్స్ స్టార్‌కు మొండిచెయ్యి.. కారణం అదేనా?

క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కూడా వరల్డ్ కప్‌లో రాణించాలని అనుకుంటాడు. కానీ చాలా మందికి ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం రాదు. ట్యాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాక వరల్డ్ కప్‌లో ఆడలేకపోతారు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హ్యారీ బ్రూక్ విషయంలో అదే జరిగింది.

ఈ ఇంగ్లండ్ యువ కెరటం ఇటీవల జరిగిన యాషెస్ సిరీసులో అద్భుతంగా రాణించాడు. కానీ తాజాగా ఇంగ్లండ్ ప్రకటించిన వన్డే టీంలో చోటు కోల్పోయాడు. న్యూజిల్యాండ్‌తో జరిగే వన్డే సిరీసుతోపాటు వరల్డ్ కప్ ఆడే టీంను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జాబితాలో బ్రూక్ పేరు లేదు.

 Sunrisers Hyderabad star omitted from World Cup squad

ఈ మెగా ఈవెంట్ కోసమే వెటరన్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్‌మెంట్ వెనక్కు తీసుకున్నాడు కూడా. ఈ కారణంగానే బ్రూక్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టాన్ అంటున్నాడు. స్టోక్స్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తీసుకున్న తర్వాత బ్రూక్‌ను ఆడించడం కుదరదని ఆథర్టాన్ స్పష్టం చేశాడు.

మంచి ఫామ్‌లో ఉన్న బ్రూక్‌ను పక్కన పెట్టడం సాధారణ ఫ్యాన్స్‌కు షాకింగ్‌గా అనిపించొచ్చని, కానీ స్టోక్స్ వంటి సీనియర్ ప్లేయర్‌ రీఎంట్రీ ఇవ్వడం వల్లనే బ్రూక్‌కు అవకాశం దక్కలేదని ఆథర్టాన్ వివరించాడు. 'ఈ విషయంలో బ్రూక్ అన్ లక్కీ అని చెప్పాలి. తనో టెర్రిఫిక్ ప్లేయర్. అలాంటి వాడు టీంలో ఉండాలని అంతా అనుకుంటారు' అని చెప్పాడు.

'స్టోక్స్ వచ్చాక బ్రూక్‌ను ఎలా ఆడిస్తారు? ఓపెనర్‌గా బెయిర్‌స్టో, రాయ్ ఉన్నారు. బ్యాకప్‌గా మలన్ ఉంటాడు. ఇక రషీద్, మొయీన్ అలీ లేకపోతే లివింగ్‌స్టోన్ తన స్పిన్‌తో ఆదుకుంటాడు. వీళ్లలో ఎవర్నీ తీసేయలేం. అందుకే బ్రూక్‌ను తప్పించారు' అని చెప్పుకొచ్చాడు.

టెస్టుల్లో మంచి ఫామ్‌లో ఉన్న బ్రూక్.. ఇప్పటి వరకు వైట్ బాల్ క్రికెట్‌లో అంత గొప్పగా ఆకట్టుకోలేదు. ఇది కూడా అతన్ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం కావొచ్చు. కానీ ఇదంతా చూసిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం.. బ్రూక్‌ను ఇంగ్లండ్ రాయుడు అంటూ సింపథీ చూపిస్తున్నారు.

Story first published: Thursday, August 17, 2023, 8:17 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+