భువి, జాన్సెన్‌కు 4 కోట్లకు పైగా
మెగా వేలంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్, సౌతాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. 50 లక్షల రూపాయల కనీస ధరతో మెగా వేలంలోకి వచ్చిన మార్కో జాన్సెన్‌ను సన్‌రైజర్స్ 4 కోట్ల 40 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఇక వేలంలోకి 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో వచ్చిన టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను 4 కోట్ల 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే గతంలోనూ సన్‌రైజర్స్ తరఫునే ఆడిన భువనేశ్వర్‌కు అప్పటి కంటే 4 కోట్ల 30 లక్షల రూపాయల తక్కువ ధరకు దక్కించుకుంది. గత సీజన్లో భువికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించింది.
త్యాగి, నటరాజన్‌కు 4 కోట్లు
మెగా వేలంలో 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్న యువ పేసర్ కార్తీక్ త్యాగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే మరో పేసర్ టి. నటరాజన్‌ను కూడా అదే ధరకు దక్కించుకుంది. కోటీ రూపాయల బేస్ ప్రైజ్‌తో నటరాజన్ వేలంలోకి రాగా 4 కోట్ల రూపాయలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.

ఫ్యాన్స్ ట్రోల్స్
దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ వ్యూహంపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు మాత్రం కొనియాడుతున్నారు. మెగా వేలంలో కేవలం 4 కోట్ల రూపాయల బౌలర్లను మాత్రమే కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ ముందే డిసైడ్ వేలంలోకి వచ్చినట్టుందని పలువురు చెప్పుకొస్తున్నారు. స్టార్ బౌలర్లను వదిలేసి ఇలా అనామక ఆటగాళ్లను 4 కోట్లకు కొనుగోలు చేస్తే టీం బౌలింగ్ బలహీనంగా తయారవుతుందని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంత మంది మాత్రం సన్‌రైజర్స్ పిసినారిగా వ్యవహరిస్తుందని అంటున్నారు.

సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ ఇప్పటివరకు 11 మందిని కొనుగోలు చేసింది. రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే సన్‌రైజర్ష్ వద్ద ప్రస్తుతం 14 మంది ఆటగాళ్లు ఉంటారు. వేలంలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఐడెన్ మాక్రమ్, కార్తీక్ త్యాగి, నటరాజన్, మార్కో జాన్సెన్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, సుచిత్, శ్రేయస్ గోపాల్‌ను కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications
