మ్యాచు పాయె.. పైసలూ పాయె: టోటల్ గా.. !!
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో దాదాపుగా ఒక అడుగు వేసింది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై సాధించిన అద్భుతమైన 82 పరుగుల విజయం గుజరాత్ టైటాన్స్ కు కీలకమైన 16 పాయింట్లను తెచ్చిపెట్టింది. 12 మ్యాచ్‌లలో 16 పాయింట్స్‌ను ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే మ్యాజిక్ నంబర్‌గా పరిగణిస్తారు. ఈ గెలుపుతో ఇతర జట్ల ప్లేఆఫ్స్ అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
మ్యాచ్ ఓడిన బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు 12 లక్షల రూపాయల జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ చర్య తీసుకున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పాట్ కమ్మిన్స్ స్లో ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించాడని తెలిపింది. ఇది అతని జట్టుకు ప్రస్తుత సీజన్‌లో మొదటి తప్పు. కమిన్స్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించామని ఐపీఎల్ పేర్కొంది.

ఈ మ్యాచ్‌లో సుమారు 82 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా తమ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. క్యాన్సర్ అవగాహన కోసం ప్రత్యేక లావెండర్ జెర్సీలు ధరించి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. విజయదుందుభి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50)ల అద్భుత అర్ధ సెంచరీల సహాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
అహ్మదాబాద్ పిచ్‌పై 169 పరుగుల లక్ష్యం సులువుగా అందుకొనేదిగా అనిపించింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్ పవర్‌ప్లేలో విధ్వంసకర బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కుప్పకూల్చారు. దీంతో సన్ రైజర్స్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ మొదటి ఓవర్‌లోనే విధ్వంసకర ట్రావిస్ హెడ్‌ను నాలుగు బంతుల్లో డకౌట్ చేసి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేర్చాడు.
రెండవ ఓవర్‌లో రబాడా అభిషేక్ శర్మను ఔట్ చేయగా, ఆ తర్వాత ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 11), స్మరణ్ రవిచంద్రన్ (9)లను కూడా త్వరగా వెనక్కి పంపాడు. దీంతో సన్‌రైజర్స్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత జేసన్ హోల్డర్ (3-20), ప్రసిధ్ కృష్ణ (2-23) మధ్య ఓవర్లలో ఒత్తిడిని కొనసాగించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రమే కాసేపు ప్రతిఘటించి 9 బంతుల్లో 19 పరుగులు (1 ఫోర్, 2 సిక్సర్లు) చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications