
6-9 నెలల సమయం:
తాజాగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన గాయంపై స్పదించాడు. 'గత కొన్ని వారాలుగా త్రో వేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అయితే వచ్చే వారం నుంచి త్రో వేయడం ప్రారంభిస్తా. ప్రస్తుతం వికెట్ల మధ్య పరిగెత్తడమే అసలు సమస్య. గాయం నుంచి కోలుకోవడానికి మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మెరుగైన చికిత్స తీసుకుంటున్నా. ఈ చికిత్సతో త్వరగా గాయాన్ని అధిగమిస్తానని ఆశిస్తున్నా' అని వార్నర్ తెలిపాడు. వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రధాన ఆటగాడు అన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టుకు ఆడుతున్నాడు.

ఐపీఎల్ 2021కు దూరం:
మరో రెండు నెలల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం కానుండటంతో.. గాయంతో డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. కోలుకోవడానికి 6-9 నెలల సమయం పడుతుందంటే.. ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికి అతడు దూరమవనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వార్నర్ సారథిగా బాధ్యతలు వహిస్తున్నాడు. అంతేకాదు ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తాడు. దీంతో గత కొన్నేళ్లుగా ఎస్ఆర్హెచ్కు వార్నర్ ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. ఒకవేళ వార్నర్ దూరమయితే ఎస్ఆర్హెచ్కు భారీ ఎదురుదెబ్బే. వార్నర్ దూరమయితే కేన్ విలియంసన్ సారథిగా ఉంటాడు.

రెండో వన్డేలో గాయం:
గతేడాది నవంబర్ మాసంలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమవ్వడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అంతేకాదు టెస్టు సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు సైతం ఆడలేదు. ఆడిన రెండు టెస్టుల్లో 5, 13, 1, 48 పరుగులు చేశాడు. ఇక గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు.

భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ:
ఐపీఎల్ పుణ్యమాని డేవిడ్ వార్నర్ లక్షలాది మంది భారతీయుల అభిమానం చూరగొన్నాడు. ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీ ఫాన్స్ వార్నర్‌ను హైదరాబాదీ అని, మా అన్న అని, కాండిస్ వార్నర్‌ను వదిన అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. నిజం చెప్పాలంటే.. వార్నర్‌కు ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. అద్భుత ఆటతీరుతో భారత అభిమానుల మనసు దోచుకున్నాడు. అంతేకాదు మన తెలుగు జట్టుకు కప్ కూడా అందించాడు.
IPL 2021 Auction: నాలుగు రోజులు ఆలస్యమైంది.. లేదంటే కోట్లు పలికేవి: అశ్విన్