కోచ్ ఏం చెప్పాడు: ఐపీఎల్ 2019కి విలియమ్సన్ దూరమేనా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది కెప్టెన్‌గా జట్టుని ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లకి దూరం కానున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ విలియమ్సన్ గాయపడిన సంగతి తెలిసిందే.
బంగ్లాతో టెస్టులో గాయం
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ తీసిన తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు. దీంతో శనివారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడో టెస్టుకి విలియమ్సన్ దూరంగా ఉండనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

మార్చి 23 నుంచి ఐపీఎల్ ఆరంభం
దీంతో మార్చి 23 నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌కు కూడా కేన్ విలియమ్సన్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతేడాది సఫారీ పర్యటనలో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించడంతో 2018 ఐపీఎల్‌కి కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ దూరమైన సంగతి తెలిసిందే.

వార్నర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు
దీంతో వార్నర్ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కేన్ విలియమ్సన్ గతేడాది జట్టుని సమర్థంగా ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఫైనల్లో సన్‌రైజర్స్ బౌలర్లు తేలిపోవడంతో హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు డేవిడ్ వార్నర్‌పై విధించిన ఏడాది పాటు నిషేధం మార్చి 28తో ముగియనుంది.

కెప్టెన్ ఎవరు?
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా, విలియమ్సన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో కెప్టెన్‌గా జట్టుని ఎవరు నడిపిస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో తిరిగి సన్‌రైజర్స్ కెప్టెన్సీ పగ్గాలు వార్నర్ అందుకుంటాడమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications