
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-11వ సీజన్‌లో తమ జట్టు వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్‌ని నియమిస్తున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లను ఐపీఎల్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. వార్నర్ జట్టుకు కెప్టెన్‌గానూ, జట్టు సభ్యుడిగానూ వైదొలగడంతో దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్పులు చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ని నియమిస్తూ.. యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. తాజాగా భువనేశ్వర్ కుమార్‌కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తూ.. హైదరాబాద్ జట్టు సీఈవో కె షణ్ముగం ప్రకటన విడుదల చేశారు.
ఈ నిర్ణయం పట్ల జట్టు సభ్యులతో పాటు హైదరాబాద్ జట్టు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో భువనేశ్వర్‌కి మంచి రికార్డు ఉంది. 2017 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి భువనేశ్వర్ పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్మిత్‌ని తొలగించి అతని స్థానంలో అజింక్యా రహానేకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు:
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:
భువనేశ్వర్ కుమార్ - రూ. 5 కోట్లు
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
1. శిఖర్ ధావన్ - రూ. 5 కోట్లు
2. షకీబ్ అల్ హసన్ - రూ.2 కోట్లు
3. కేన్ విలియమ్సన్ - రూ.3 కోట్లు
4. మనీష్ పాండే - రూ. 11 కోట్లు
5. కార్లోస్ బ్రాత్‌వైట్ - రూ.2 కోట్లు
6.యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు
7. వృద్ధిమాన్ సాహా - రూ. 5 కోట్లు
8. కర్ణ్ శర్మ- రూ. 5 కోట్లు
9. రషీద్ ఖాన్ - రూ.9 కోట్లు
10. రిక్కీ భుయి - రూ.20 లక్షలు
11. దీపక్ హుడా- రూ.3.6 కోట్లు
12. సిద్ధార్థ్ కౌల్ - రూ.3.8 కోట్లు
13. నటరాజన్ - రూ.40 లక్షలు
14. సయ్యద్ ఖలీల్ అహ్మద్ - రూ.3 కోట్లు
15. మహ్మద్ నబీ- రూ. కోటి
16. సందీప్ శర్మ- రూ. 3 కోట్లు
17. సచిన్ బేబీ- రూ. 20 లక్షలు
18. క్రిస్ జోర్డాన్- రూ. కోటి
19. బిల్లీ స్టాన్‌లేక్ - రూ.50 లక్షలు
20. తన్మయ్ అగర్వాల్ - రూ.20 లక్షలు
21. శ్రీవాత్స్ గోస్వామి- రూ. కోటి
22. బిపుల్ శర్మ - రూ.20 లక్షలు
23. మోహదీ హసన్ - రూ.20 లక్షలు