టామ్ మూడీకి ఉద్వాసన: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కోచ్

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ట్విటర్‌లో అధికారిక ప్రకటన చేసింది. దీంతోపాటు ఏడు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు సేవలందించిన టామ్ మూడీకి ధన్యవాదాలు తెలిపింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలవడంతో
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలవడంతో హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్ కీలకపాత్ర పోషించాడు. దీంతో ట్రెవర్ బేలిస్ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమ్రోగిపోతుంది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా చివరి వరకు ప్రయత్నించింది. అయితే, సన్‌రైజర్స్ భారీ మొత్తానికి ఆయన్ని సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌లో సైతం బేలిస్‌కు మంచి రికార్డు
ఐపీఎల్‌లో సైతం బేలిస్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో రెండు సార్లు విజేతగా నిలిచినప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా బేలిస్ ఉన్నాడు. దీంతో పాటు సిడ్నీ సిక్సర్స్ బిగ్‌బాష్ లీగ్ గెలవడంలో కోచ్‌గా బేలిస్ పాత్ర మరవలేనిది. ఇక, సన్‌రైజర్స్‌కు కోచ్‌గా టామ్ మూడీకి ఆ జట్టు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. మూడీ కోచింగ్‌లోనే సన్‌రైజర్స్ 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో పాటు, ఐదు సార్లు ప్లే ఆఫ్‌కు చేరింది.
కోచ్‌గా టామ్ మూడీ సేవలు ముగిశాయి
"నూతన హెడ్ కోచ్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. దీంతో కోచ్‌గా టామ్ మూడీ సేవలు ముగిశాయి. ఛాంపియన్స్ ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. గతంలో కేకేఆర్ ప్రధాన కోచ్‌గా ఉన్న ట్రెవర్ రెండు ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు. అంతేకాకుండా సిడ్నీ సిక్సర్స్‌కు బిగ్‌బాష్ లీగ్ టైటిల్, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందించాడు. ఎంతో విజయవంతమైన అతని రికార్డుని పరిశీలించి జట్టుకు కోచ్‌గా ఎంపిక చేశాం" అని సన్‌రైజర్స్ పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications