
సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజా సంచలనం శశాంక్ సింగ్ తన క్రికెట్ జర్నీని సన్‌రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పెషల్ వీడియో ద్వారా తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 6బంతుల్లో 25పరుగులతో తనకు లభించిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ బ్యాటర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన మార్క్ ప్రారంభాన్ని చాటుకున్నాడు. తన ప్రదర్శన ద్వారా.. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లోయర్ ఆర్డర్లో ఫైర్ పవర్ ఉన్న ఆటగాడు ఒకడున్నాడని చాటిచెప్పాడు. శశాంక్ గురించి పెద్దగా ఇప్పటివరకు క్రికెట్ ప్రపంచానికి తెలియదు. ఈ క్రమంలో శశాంక్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభాన్ని గురించి స్పెషల్ వీడియలో ఆసక్తికర విషయాలు చెప్పాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక టోర్నమెంట్‌లలో తాను బాగా రాణించాక ముంబైకి వచ్చానని.. అప్పుడే తనకు వాస్తవంగా క్రికెట్లో ఉన్న పోటీ ఏంటో అర్థమయిందని పేర్కొన్నాడు. ఈ పోటీని తట్టుకుని నిలబడాలంటే.. నాలోని బెస్ట్ ఇవ్వాల్సిందేనని భావించి రాణించేవాడినని తెలిపాడు.
శశాంక్ మాట్లాడుతూ.. "నేను ముంబైకి వచ్చినప్పుడు, నా వయస్సు 17సంవత్సరాలు. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. భోపాల్‌తో పోల్చితే ముంబైలో ఎలాంటి పోటీ ఉంటుందో చూడాలనుకున్నా. భోపాల్ లాంటి జిల్లా స్థాయిలో పరుగులు సాధిస్తున్నప్పుడు మనం చాలా ప్రతిభావంతులమనే అనిపిస్తుంది. కానీ ముంబైకి వచ్చినప్పుడు.. నా అభిప్రాయం అంత సరైనది కాదని పొరబడ్డాను. ఎందుకంటే.. మన ముందే మన కంటే ఎక్కువ పరుగులు చేసేవారు, మన కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు, మన కంటే తక్కువ వయస్సులోనే ఎక్కువగా రాణిస్తున్న ప్లేయర్లను ఎంతో మంది ముంబైలో కన్పిస్తారు. అప్పుడే మన కంటే ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారనే వాస్తవం గ్రహించాలని తెలిసింది.' అని శశాంక్ పేర్కొన్నాడు.