Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing 11: వార్నర్ ఔట్.. రాయ్ ఇన్! మరో మూడు మార్పులు! రాజస్థాన్‌తో బరిలోకి దిగే సన్‌రైజర్స్ జట్టు ఇదే!!

Sunrisers Hyderabad playing 11 vs RR: Jason Roy In And David Warner Out

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఈరోజు రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్), సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమావారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. సన్​రైజర్స్ 8వ స్థానంలో, ఆరో స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్​ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి రాజస్థాన్​, గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్న సన్​రైజర్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీ నుంచి గౌరవంగా వైదొలగడానికి అన్ని విభాగాల్లోనూ సన్​రైజర్స్​ మెరుగైన ప్రదర్శన చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్ నేపథ్యంలో సన్​రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం.

అద్భుతమే జరగాలి:

అద్భుతమే జరగాలి:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఐపీఎల్ 2021లో ఒక మ్యాచులో కూడా సరైన ఆట ఆటలేదు. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం ఒకే ఒక్క మ్యాచులో విజయం సాధించింది. 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్​ రెండో దశలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్​ కింగ్స్ చేతిలో ఓటమి చవిచూసింది సన్​రైజర్స్​. ఇంకా ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీలో ఐదు మ్యాచులు ఆడనుంది. అన్ని గెలిచినా 12 పాయింట్లు మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో చేరుతాయి. 12 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరడం అసాధ్యం. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. గతంలో సన్‌రైజర్స్ జట్టుకు మిడిల్ ఆర్డర్ సమస్య ఒక్కటే ఉండేది. ఈసారి టాప్ ఆర్డర్ విఫలమవడంతో పాటు బౌలింగ్‌లో పస లేకపోవడంతో వరుస ఓటములను ఎదుర్కొంటోంది.

 జేసన్ రాయ్ ఇన్:

జేసన్ రాయ్ ఇన్:

ఐపీఎల్ 2021లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్న‌ర్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచులో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. దాంతో తొలి దశలో ఒక మ్యాచుపై వేటు పడగా.. జానీ బెయిరిస్టో అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీపై వార్నర్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచులో డకౌట్ అయ్యాడు. అయినా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో మరో అవకాశం వచ్చింది. 3 బంతుల్లో 2 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. దాంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచులో అతడిపై వేటు పడనుంది. వార్నర్ స్థానంలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రాయ్ మంచి హిట్టర్ అన్న సంగతి తెలిసిందే.

జాదవ్ స్థానంలో అభిషేక్:

జాదవ్ స్థానంలో అభిషేక్:

డేవిడ్ వార్నర్ సహా కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌, స్టార్ బ్యాటర్ మనీశ్‌ పాండే తక్కువ స్కోరుకే పరిమితమవుతున్నారు. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఇద్దరు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. వృద్ధిమాన్ సాహా పరుగులు చేస్తున్నా.. భారీ ఇన్నింగ్స్ ఆడడం లేదు. వరుసగా విఫలమవుతున్న కేదార్ జాదవ్ కూడా దాదాపుగా ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. అతడి స్థానంలో అభిషేక్ శర్మ ఆడనున్నాడు. ఢిల్లీపై చెలరేగిన అబ్దుల్ సమద్.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో విఫలమయ్యాడు. అతడు మరోసారి సత్తాచాటాల్సిన అవసరం ఉంది. బౌలర్లో రషీద్‌ ఖాన్‌ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నటరాజన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ అంచనాలు అందుకోవట్లేదు. సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ స్థానాల్లో జగదీష్ సుచిత్ మరియు బాసిల్ తంపి తుది జట్టులోకి రానున్నారు.

 సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా):

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా):

జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జగదీష్ సుచిత్, బాసిల్ థంపి.

Story first published: Monday, September 27, 2021, 10:05 [IST]
Other articles published on Sep 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+