Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ ప్లేయర్ విధ్వంసం.. 35 బంతుల్లోనే 85 పరుగులు (Video)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో డర్బన్ సూపర్ జెయింట్స్‌ తరపున ఆడుతున్న వికెట్ కీపర్ క్లాసెన్ 35 బంతుల్లోనే 85 పరుగులు సాధించాడు. నాలుగు పోర్లు, ఎనిమిది సిక్సర్లతో విరుచుపడుతూ 242 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. అతడి ధాటికి ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్ (MI కేప్‌ టౌన్)పై డర్బన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన MI కేప్‌టౌన్ 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ రికెల్టన్ (87; 51 బంతుల్లో) చెలరేగాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు సాధించాడు. మరో ఓపెనర్ వాండెర్ డసెన్ (24; 20 బంతుల్లో)తో కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం డర్బన్ బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్ల సాధిస్తూ స్కోరువేగాన్ని తగ్గించారు. కానీ ఆఖర్లో లివింగ్‌స్టోన్ (25; 20 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ పొలార్డ్ (31*; 14 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

Sunrisers Hyderabad player Heinrich Klaasen destroyed. He got 85 runs in 35 balls.

అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడి రాకతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆటను తిరిగి ప్రారంభించడం కుదరకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో డర్బన్ విజేతగా ప్రకటించారు. అయితే డర్బన్‌కు పేలవమైన ఆరంభం లభించింది. 6.1 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ వన్ మ్యాన్‌ షోతో విజృంభించాడు. సహచరులు వెనుదిరుగుతున్నా బౌండరీల మోత మోగించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అయితే రబాడ బౌలింగ్‌లో క్లాసెన్ ఔటైన కొద్దిసేపటికే వర్షంతో ఆట ఆగిపోయింది. SA20లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

Story first published: Friday, January 12, 2024, 11:39 [IST]
Other articles published on Jan 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+