Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్ - కాస్కోండి ఇక 'అతడు' వచ్చేస్తున్నాడు!

ఈ సీజన్ లో ఎలాగైనా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్. గాయంతో ఇబ్బంది పడుతోన్న ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎట్టకేలకు కోలుకుని, ఈ సీజన్ కు అందుబాటులో వస్తానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపాడు. ఇంతకీ అతడెవరంటే?

గాయం గురించి కీలక అప్డేట్..
ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్.. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అతడు కోలుకుంటున్నాడు. అయితే అతడు మార్చిలో జరగబోయే ఐపీఎల్ తో పాటు జూన్ లో సౌతాఫ్రికాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అందుబాటులో ఉండే దిశగా సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. తాజాగా తన గాయం గురించి కమిన్స్ కీలక అప్డేట్ ఇవ్వడంతో ఈ విషయం అర్థమైంది.

Sunrisers hyderabad Pat Cummins confirms he should be ready for the IPL 2025

చాలా బలంగా ఉన్నా...
"నా చీలిమండ గాయం తగ్గుతోంది. ఇప్పుడు బానే ఉందనిపిస్తోంది. బలంగానే ఉంది. విశ్రాంతి బాగా తీసుకున్నాను. దీంతో అది క్రమంగా రికవరీ అయిపోతోంది. అదే క్రికెట్ ఆడి ఉంటే అయ్యేది కాదు. నాకు తెలిసి ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్ నాటికి సెట్ అవ్వడమే నా ప్లాన్. బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నాను. బలంగా బ్యాకప్ అయ్యేలా ముందుకు సాగుతున్నాను. కాబట్టి ఆందోళన చెందాల్సి అవసరం లేదు.

ఈ గాయానికి సర్జరీ కన్నా కూడా ఎక్కువ కాలం రెస్ట్ తీసుకుని తగ్గించుకుంటే మంచిదని భావించాను. కొన్నిసార్లు క్రికెట్ టూర్ల కోసం హడావుడిగా చికిత్స తీసుకోవడం కన్నా.. పర్యటనను పక్కన పెట్టి క్రమపద్ధతిలో చికిత్స తీసుకోవడం మంచిది. ఒక్క పర్యటన మిస్ అయినంత మాత్రాన ఏమీ అవ్వదు. ఇంకా మనం ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశం దొరుకుతుంది" అని చెప్పుకొచ్చాడు.

కాగా, ఐపీఎల్ 2025 సీజన్ ను.. రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ తో మొదలు పెట్టనుంది సన్ రైజర్స్. ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది.

Story first published: Wednesday, February 26, 2025, 17:29 [IST]
Other articles published on Feb 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+