సన్‌రైజర్స్ కుర్రాడి సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి!
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ హుస్సేన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బీహార్‌కు చెందిన 21 ఏళ్ల ఈ యువకుడు విరాట్ కోహ్లీని అవుట్ చేసి తన కెరీర్‌లో అత్యంత పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత సాకిబ్ ఆనందానికి అవధులు లేవు, అంతేకాకుండా తన పేరున ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి..!
సాకిబ్‌కు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ చాలా అద్భుతంగా సాగుతోంది. బెంగళూరుతో జరిగిన ఈ పోరులో కోహ్లీ వికెట్ తీయడంతో పాటు మరో వికెట్‌ను కూడా పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సాకిబ్ ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో తన వికెట్ల సంఖ్యను 15కి పెంచుకున్నాడు. ముఖ్యంగా, ఈ ఏడాది ఆడిన ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ అయినా తీశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఏ బౌలర్ కూడా సాధించని అరుదైన రికార్డుగా నిలిచింది. కేవలం తన మొదటి ఐపీఎల్ సీజన్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 79 పరుగులు) తెలివైన, వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51 పరుగులు), నితీష్ రెడ్డి మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్ 250 పరుగుల మార్కును దాటింది. హైదరాబాద్ బ్యాటర్లు మొత్తం 20 ఫోర్లు, 16 సిక్సర్లు బాదారు.
బెంగళూరుకు 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఎన్నటికీ తేలికైన పని కాదు. జట్టుకు శుభారంభం లభించలేదు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దేవదత్ పడిక్కల్ కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వెంకటేష్ అయ్యర్ కొన్ని మంచి షాట్లు ఆడి పరుగుల వేగాన్ని కొనసాగించడానికి ప్రయత్నించినా, పరుగుల పర్వతం చాలా ఎత్తుగా ఉండటంతో బెంగళూరు పట్టునుండి మ్యాచ్ క్రమంగా జారిపోయింది. చివరికి హైదరాబాద్ సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications