IPL 2023 : సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఈ ముగ్గురిలో ఎవరు?

వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం అన్ని జట్లూ గట్టిగా రెడీ అయ్యాయి. ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని అనుకుంటున్న ఈ ఫ్రాంచైజీలు.. దానికి తగ్గట్లే మినీ వేలంలో ఆటగాళ్లను టార్గెట్ చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా చాలా తెలివిగా జట్టు కూర్పు చేసుకుంది. మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది జట్టుకు నాయకత్వం వహించిన కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసేసిన క్రమంలో.. ప్రస్తుతం సన్‌రైజర్స్ ముందు మూడు కెప్టెన్సీ ఆప్షన్లు కనిపిస్తున్నాయి.

మయాంక్ అగర్వాల్
మినీ వేలంలో అత్యంత భారీ ధర పలికిన భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్. తన కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు అతను ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది పంజాబ్ సారధిగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్సీ భారం బ్యాటింగ్‌పై పడటంతో చాలా పేలవమైన సీజన్ చూశాడు. దీంతో అతన్ని పంజాబ్ యాజమాన్యం విడుదల చేసేసింది. విలియమ్సన్ లేని సమయంలో టాపార్డర్‌లో ధనా ధన్ ఇన్నింగ్స్‌లు ఆడే ఆటగాడి కోసం వెతుకుతున్న సన్‌రైజర్స్ అతన్ని కొనుగోలు చేసింది. మరి ఈ ఫ్రాంచైజీ కూడా మయాంక్‌కు జట్టు పగ్గాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భువనేశ్వర్ కుమార్
సన్‌రైజర్స్ క్యాంపులో ఉన్న సీనియర్ ప్లేయర్ల పేర్లు చెప్పమంటే టక్కున గుర్తొచ్చే పేరు భువనేశ్వర్ కుమార్. ఇంతకుముందు మొత్తం ఏడు సార్లు సన్‌రైజర్స్ జట్టుకు భువీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే వీటిలో ఐదుసార్లు కెప్టెన్‌గా ఓటమినే చవిచూశాడు. అయితే భువీ అనుభవం వల్ల అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ మిగతా ఫ్రాంచైజీల్లో బౌలర్లు కెప్టెన్‌గా ఉన్న దాఖలాలు లేవు. కాబట్టి భువీకి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం కష్టమని కూడా కొందరు అంటున్నారు.

వాషింగ్టన్ సుందర్
ఈ యువ ఆల్‌రౌండర్ వయసు 23 ఏళ్లే కానీ.. ఇప్పటికే ఆరు ఐపీఎల్ సీజన్లు ఆడిన అనుభవం అతనికి ఉంది. తన కెరీర్‌లో మొత్తం 51 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అతను.. 33 వికెట్లు తీసుకున్నాడు. ఇటీవలి కాలంలో తన బ్యాటింగ్ కూడా చాలా మెరుగు పరుచుకున్న సుందర్.. గతేడాది సన్‌రైజర్స్ తరఫున కొన్ని కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే భారత్ తరఫున కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్సులు ఆడాడు. ఈ యువ ఆటగాడిని జట్టు కెప్టెన్‌గా తయారు చేయాలని సన్‌రైజర్స్ అనుకుంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా మారతాడని విశ్లేషకుల అంచనా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications