'ఐపీఎల్ 2020 కోసం వ్యూహాత్మకంగా సిద్ధమయ్యాం.. సామర్థ్యం ఉన్న కుర్రాళ్లను వేలంలో తీసుకున్నాం'

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం తాము వ్యూహాత్మకంగా సిద్ధమయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్, టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. మిడిలార్డర్‌లో మనీశ్ పాండే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడన్నారు. టాప్, మిడిలార్డర్‌లో సామర్థ్యం ఉన్న కుర్రాళ్లను వేలంలో తీసుకున్నామని వెల్లడించారు. అందరికంటే లేటుగా దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్.. క్వారంటైన్ పూర్తిచేసుకుని మమ్మురంగా ప్రాక్టీస్ చేస్తోంది.

పాండే ఆత్మవిశ్వాసం బాగుంది:
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'టీమిండియాకు ఆడాక మనీశ్ పాండే ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఇప్పుడు మరింత బాగా ఆడగలదని నమ్మకం ఉంది. విజయ్ శంకర్ ఆరో స్థానంలో ఆడగలడు. మొహమ్మద్ నబీ, మిచెల్ మార్ష్, ఫాబియన్ అలన్ వంటి విదేశీ స్టార్లు ఉన్నారు. మా ఆటగాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేయగలరు. టోర్నీలో మాది చక్కని ఫీల్డింగ్ జట్టు' అని తెలిపారు. అంతర్జాతీయ కెరీర్‌లో హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ 131 టెస్టుల్లో, 86 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 20 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడాడు.

వేలంలో దానిని పరిష్కరించుకున్నాం:
'గత సీజన్‌లో సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో నిలిచింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో అద్భుతంగా ఆడారు. అయితే వారిద్దరే ఎక్కువగా ఆడటంతో మిడిలార్డర్ రాణించేందుకు అవకాశం రాలేదు. జాతీయ జట్ల కోసం వారు వెళ్లిపోగానే.. మేము సామర్థ్యం మేరకు ఆడలేదు. ఈ పరిస్థితులను గమనించే వేలంలో దానిని పరిష్కరించుకున్నాం. మిడిలార్డర్‌లో దేశవాళీ క్రికెట్లో రాణించిన ప్రతిభావంతులను మేం తీసుకున్నాం. అండర్-19 సారథి ప్రియమ్ గార్గ్, జమ్ము నుంచి సమద్, ఝార్ఖండ్ నుంచి విరాట్ సింగ్‌ను కొనుగోలు చేశాం. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించిన సంజయ్ యాదవ్, సందీప్‌ను తీసుకున్నాం' అని లక్ష్మణ్ చెప్పారు.

విలియమ్సన్ జట్టులో అంతర్భాగం:
న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తమ జట్టులో అంతర్భాగమని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. డేవిడ్ వార్నర్ లేనప్పుడు జట్టును చక్కగా ముందుకు నడిపించాడని ప్రశంసించారు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు అతడు సారథ్యం వహించిన తీరు అద్భుతమని పేర్కొన్నాడు. కరోనా వల్ల ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సి వస్తోందన్నారు. ఆటగాళ్లు ఇందుకు త్వరగానే అలవాటు పడుతున్నారని వీవీఎస్ అన్నారు.

ఓ వరంగా భావిస్తున్నాం:
అసలు మ్యాచులే లేకపోవడం కన్నా బయో బడుగలో ఆంక్షల నడుమ ఐపీఎల్ 2020 జరగడం ఓ వరంగా భావిస్తున్నారని హైదరాబాద్ మెంటర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. కొత్త కోచ్ ట్రెవర్ బేలిస్‌తో కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. ఆయన ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీలు అందించారని ఆయన ప్రశంసించారు.
ఐదు నెలల కసి: రోహిత్ సిక్స్ బాదితే.. బంతి రోడ్డుపై వెళుతున్న బస్సుపై పడింది (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications