న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది: సన్‌రైజర్స్‌పై వార్నర్ ఇలా

Sunrisers Hyderabad like my second family away from home: David Warner

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ... టీమ్‌తోనే ఉన్న అనుభూతిని సన్‌రైజర్స్ యాజమాన్యం తనకు కల్పించిందని ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. గత సీజన్‌లో ఫైనల్‌ వరకు చేరిన సన్‌రైజర్స్‌ ప్రస్థానాన్ని తాను గమనించానని అన్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధంతో డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలియమ్సన్ అందుకున్నాడు. కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టు గతేడాది ఫైనల్ వరకు వెళ్లింది.

గతేడాది రన్నరప్‌గా సన్ రైజర్స్

గతేడాది రన్నరప్‌గా సన్ రైజర్స్

అయితే, పైనల్లో చెన్నై చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. దీంతో సన్‌రైజర్స్‌ జట్టులో లేనప్పటికీ... జట్టుకు సంబంధించిన అధికారిక గ్రూప్‌ చాట్‌లో తాను భాగస్వామిగానే ఉన్నానని వార్నర్‌ తెలిపాడు. స్ఫూర్తినిచ్చే సందేశాల ద్వారా ఆటగాళ్లంతా తనను ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టు యాజమాన్యం తనపై నమ్మకం ఉంచిందని అన్నాడు.

వార్నర్ మాట్లాడుతూ

వార్నర్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ "ఏడాదంతా నేను ఈ సీజన్‌ కోసమే ఎదురు చూస్తుంటా. గతేడాది కూడా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ప్రయాణాన్ని పరిశీలించా. జట్టులో లేనప్పటికీ... గ్రూప్‌ సందేశాల ద్వారా జట్టుతోనే ఉన్నానన్న అనుభూతి కలిగింది. హైదరాబాద్‌ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.

కఠినకాలంలోనూ వీరంతా నా వెంటే ఉన్నారు

"టీమ్, యాజమాన్యం, అభిమానులు చూపించే ఆత్మీయత ఈ సమయంలో నాకు, నా కుటుంబానికి ఎంతో అవసరం. కఠినకాలంలోనూ వీరంతా నా వెంటే ఉన్నారు. ఇప్పుడు నేను వారికి ఎంత కృతజ్ఞత తెలిపినా తక్కువే" అని వార్నర్‌ అన్నాడు. ఈసారి టైటిల్ లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామని వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన వార్నర్

లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన వార్నర్

తనకు ఆత్మీయ స్వాగతం పలికిన సన్‌రైజర్స్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు వార్నర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. "దిగ్గజ క్రీడాకారుడైన లక్ష్మణ్‌ ఎంతో వినయవిధేయతలు కలవాడు. నాలో చాలా స్ఫూర్తిని నింపాడు. అతని కారణంగానే సన్‌రైజర్స్‌ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది" అని వార్నర్ అన్నాడు. అసీస్ చేతిలో కోహ్లీసేన వన్డే సిరిస్‌ను కోల్పోవడంపై చివరి రెండు మ్యాచ్‌లకు ధోని అందుబాటులో లేకపోవడంతో ఆసీస్‌కు పని తేలికైందని అన్నాడు.

"ధోని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో టీమిండియా గెలుపులో ధోని కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొహాలీ, ఢిల్లీ వన్డేల్లో ఆసీస్‌ గెలవడానికి ఏకైక కారణం టీమిండియాలో ధోని లేకపోవడమే. ఆ రెండు వన్డేల్లో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒక ఆసీస్‌ ఆటగాడిగా చెప్పాలంటే ధోని లేకపోవడం ఆసీస్‌కు వరమయింది. ప్రత్యర్థి జట్ల వ్యూహాలను అంచనా వేస్తూ ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయడం కత్తి మీద సాము వంటింది" అంటూ వార్నర్‌ అన్నాడు.

Story first published: Saturday, March 23, 2019, 17:14 [IST]
Other articles published on Mar 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X