ఐపీఎల్-2024లో ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది. కనీస పోటీ ఇవ్వకుండానే ప్రత్యర్థికి దాసోహమైంది. అయితే టైటిల్ పోరు మినహా మిగిలిన ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేసిన పోరాటం అద్వితీయం.
క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలామ్ కొట్టేలా విధ్వంసం నెలకొల్పారు. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ సన్‌రైజర్స్ పోరాడింది. 2023లో పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో సంచలన ప్రదర్శనతో ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే వచ్చే సీజన్‌లో మెగా వేలం ఉండటంతో జట్టులో నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు సహా చాలా మంది ప్లేయర్లను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ వదులుకోవాల్సిందే. కానీ రిటైన్ లిస్ట్ నిబంధనలు మారి ఎక్కువ మందిని ఫ్రాంచైజీలో కొనసాగించే అవకాశం వచ్చినా యువ స్లార్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్‌ను మాత్రం వదులుకోవాలని సన్‌రైజర్స్ సీఈవీ కావ్య మారన్ నిర్ణయించుకుంది. ఈ స్పీడస్టర్ గత రెండు సీజన్లలో నిరాశపరిచాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు.
2022లో ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో భారత జట్టులో చోటు కూడా సంపాదించాడు. కానీ ఆ తర్వాత లయ తప్పాడు. వేగంగా బంతులు మాత్రమే సంధిస్తున్నాడు. వైవిధ్యం చూపించడంలో విఫలమవుతున్నాడు. 2023 సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడే ఎనిమిది వికెట్లే తీశాడు. 2024లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో అతను 15 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు.
దీంతో ఏడాదికి రూ.4 కోట్లు తీసుకునే ఉమ్రాన్ మాలిక్‌ను సన్‌రైజర్స్ వదులుకోనుంది. అయితే ఈ యువ ఫాస్ట్ బౌలర్‌పై ముంబై ఇండియన్స్ ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. 150 కి.మీ సగటుతో బౌలింగ్ చేసే అతన్ని క్రమంగా రాటుదేల్చి జట్టులో కీలక బౌలర్‌గా మార్చుకోవాలని చూస్తోంది. కాగా, ఐపీఎల్ వేలంలో అతను పలికే ధరపై కూడా ఆధారపడి తీసుకోవాలని ముంబై యాజమాన్యం చూస్తోంది.