For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

Sunrisers Hyderabad have won the toss and have opted to field

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా మరికొద్ది సేపట్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విల్లియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మున్రో, అమిత్ శాలు జట్టులోకి వచ్చారు. మరోవైపు సన్‌రైజర్స్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేన్ విల్లియంసన్ సన్‌రైజర్స్ బాధ్యతలు చేపట్టాడు.

గత రెండు మ్యాచుల్లో (ముంబై ఇండియన్స్, కింగ్స్ పంజాబ్‌) ఓడిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో ఢిల్లీ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉంది. ఇక సన్‌రైజర్స్‌ 6 మ్యాచ్‌లలో మూడు గెలిచి దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. సొంత గడ్డపై ఆడుతుండంతో సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం.

జట్లు:

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), కేన్ విల్లియంసన్ (కెప్టెన్‌), విజయ్‌ శంకర్‌, రికీ బుయి, దీపక్‌ హుడా, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్ అహ్మద్.

ఢిల్లీ క్యాపిటల్స్‌:
పృథ్వీ షా, శిఖర్‌ ధావన్, మున్రో, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్, క్రిస్‌ మోరిస్, అక్షర్‌ పటేల్, అమిత్ శా, కాగిసో రబాడ, ఇషాంత్ శర్మ, పాల్.

Story first published: Sunday, April 14, 2019, 20:12 [IST]
Other articles published on Apr 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+