Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2020 నుంచి ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఓడిన జ‌ట్టుగా స‌న్‌రైజ‌ర్స్ చెత్త రికార్డు

Sunrisers hyderabad have the worst record of losing the most matches in the IPL since 2020
IPL 2022 : Sunrisers Hyderabad Record In IPL

ఐపీఎల్ 2022లో భాగంగా సోమ‌వారం ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌మి పాలైంది. త‌ద్వారా ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోయింది. అయితే 2020 నుంచి ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఓడిన జ‌ట్ల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే ఈ జాబితాలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మొద‌టి స్థానంలో ఉంది. 2020 నుంచి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత్య‌ధికంగా 21 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక 17 మ్యాచ్‌ల్లో ఓడి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, పంజాబ్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాయి. ఆ త‌ర్వాత 16 ప‌రాజ‌యాల‌తో చెన్నైసూప‌ర్ కింగ్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాయి.

ఫేలవ ప్ర‌ద‌ర్శ‌న‌తో గ‌త ఏడాది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ పాయింట్ల ప‌ట్టికలో చిట్ట చివ‌ర‌న నిలిచి తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. దీంతో ఈ ఏడాది స‌న్‌రైజ‌ర్స్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోయి ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట‌చివ‌ర‌న కొన‌సాగుతుంది. అటు డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌ది కూడా ఇదే ప‌రిస్థితి. ఆ జ‌ట్టు లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. సీఎస్కే వ‌రుస‌గా 3 ఆరంభ మ్యాచ్‌ల‌ను ఓడిపోవ‌డం ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇదే తొలి సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఇక 5 సార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఇక ఐపీఎల్ 2022లో నేడు మ‌రో ఆస‌క్తిర పోరు జ‌ర‌గ‌నుంది. వాఖండే స్టేడియం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డనున్నాయి. రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్ప‌టికే ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో ఫ‌స్ట్ ప్లేసులో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఈ మ్యాచ్‌లోనూ జోరు కొససాగించాల‌ని భావిస్తోంది. ఇక ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఈ మ్యాచ్‌లో గెల‌వాల‌ని పట్టుద‌ల‌గా ఉంది.

Story first published: Tuesday, April 5, 2022, 18:53 [IST]
Other articles published on Apr 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+