Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: SRH ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా బతికే ఉన్నాయా - ఎలాగంటే?

IPL 2025 Sunrisers Hyderabad Playoffs: ఐపీఎల్ 2025 పడి లేస్తూ కాదు.. పూర్తిగా ఓటమి బాట పట్టడం.. ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు ఓ సారి అలా లేచి నిలబడి.. మళ్లీ పడిపోవడం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథగా మారింది. గత మ్యాచ్‌లో చెన్నై జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించి మాల్దీవుల్లో పర్యటనకు వెళ్లొచ్చిన ఆరెంజ్ టీమ్.. తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్ పై ఓడిపోయింది. ఆ జట్టు 38 పరుగుల తేడాతో చిత్తైంది.

దీంతో ఈ సీజన్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథ దాదాపు ముగిసినట్లే అని అంతా ఫిక్సైపోయారు. జీటీపై ఓటమితో SRH ఫ్యాన్స్ పూర్తిగా ప్లేఆఫ్స్ ఆశలు వదులుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్ బాటలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంటికి వెళ్లిపోయిందని అంతా నిర్ణయించుకున్నారు.

sunrisers Hyderabad

అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇంకా స్వల్ప అవకాశాలున్నాయి.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ -3లో బలంగా ఉన్నాయి. నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. మరి సన్ రైజర్స్ ఈ రేసులో రావాలంటే... ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 7 ఓటములతో పాయింట్ల పట్టికలో6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ ప్రస్తుతం నెట్ రన్ రేట్ -1.192గా ఉంది. అంటే ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచులు ఆడాలి. ఆ నాలుగు మ్యాచుల్లోనూ ఆ జట్టు గెలిస్తే మొత్తంగా సన్ రైజర్స్ ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరుతాయి.

దీంతో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మిగతా జట్ల ప్రదర్శన, నెట్ రన్ రేట్ పై ఆధారపడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అంటే సన్ రైజర్స్ మిగతా అన్ని మ్యాచుల్లో గెలిచి.. అలానే ఇతర జట్లు మిగతా మ్యాచులో ఓడితే అప్పుడు ఆరెంజ్ టీమ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లేచ్చేమో అని అంటున్నారు. ఎందుకంటే గతేడాది ఆర్సీబీ కూడా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంతోనే 14 పాయింట్ల క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడా పరిస్థితి ఎస్ఆర్హెచ్ విషయంలో కనపడట్లేదు. దాదాపు ఇది అసాధ్యమనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Story first published: Saturday, May 3, 2025, 10:01 [IST]
Other articles published on May 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+