
టాప్ ఆల్‌రౌండర్ల జోలికి పోలేదు..
వేలం ప్రారంభం అవడానికి ముందు శామ్ కర్రాన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్‌లలో ఒకరి కోసం సన్‌రైజర్స్ చాలా గట్టిగా ప్రయత్నిస్తుందని అంతా అనుకున్నారు. అయితే సన్‌రైజర్స్ వాళ్లపై అంత ఆసక్తి చూపలేదు. మిగతా ఫ్రాంచైజీలు వాళ్ల కోసం తన్నుకుంటుంటే చూస్తూ ఉండిపోయింది. అందరి కన్నా ఎక్కువ పర్స్ మనీ ఉన్నా కూడా తొందర పడలేదు. ఈ వేలంలో సన్‌రైజర్స్ కొన్ని తొలి ప్లేయర్ హ్యారీ బ్రూక్. ఈ ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ కోసం ఏకంగా రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టింది కావ్య మారన్.

ప్లానింగ్‌లో క్లారిటీ..
బ్రూక్స్ అంత గొప్ప ఆటగాడు కాదని, అలాంటి వాడి కోసం ఇంత ఖర్చు పెట్టడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా సన్‌రైజర్స్ స్ట్రాటజీలో భాగమేనని మాజీ ప్లేయర్ అమోల్ ముజుందార్ అన్నాడు. పర్సులో రూ.42.25 కోట్లతో ఈ వేలంలో దిగిన సన్‌రైజర్స్.. రూ.35.7 కోట్లకే అవసరమైన 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేసింది.
ఇదే విషయాన్ని చెప్పిన మజుందార్.. 'వాళ్ల దగ్గర పెద్ద పర్స్ ఉంది. కానీ తమ సొమ్మును చాలా జాగ్రత్తగా ఖర్చు చేశారు. వాళ్ల ప్లానింగ్‌లో ఒక క్లారిటీ కనిపించింది. తమ జట్టులో బౌలింగ్ బలమని వాళ్లకు తెలుసు. అందుకే బ్యాటింగ్‌పై ఎక్కువ ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు' అని చెప్పాడు.

తెలివిగా ఖర్చు పెట్టారు
సన్‌రైజర్స్ స్ట్రాటజీని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా మెచ్చుకున్నాడు. వేలంలో బ్రూక్ కోసం రూ.13 కోట్లు ఖర్చు చేసిన సన్‌రైజర్స్, మయాంక్ అగర్వాల్ కోసం మరో రూ.8 కోట్లు ఖర్చు చేసింది. చివరగా సఫారీ వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ కోసం రూ.5 కోట్లు ఖర్చుపెట్టింది. 'వాళ్లది ఇప్పుడు బెస్ట్ టీం. అద్భుతమైన స్ట్రాటజీతో వాళ్లు ఈ వేలానికి వచ్చారు. బాగా డబ్బులు ఉన్నా కూడా వాటిని తెలివిగా ఖర్చు పెట్టారు. సన్‌రైజర్స్‌కు ఇది చాలా మంచి వేలం' అని కొనియాడాడు.


Click it and Unblock the Notifications












