Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH ఆల్‌టైమ్ రికార్డు.. ఆ ఘనతను టచ్ చేసిన జట్టే లేదు!

ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ తృటిలో కప్‌ చేజార్చుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడి టైటిల్ కోల్పోయింది. అయితే సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున ఎస్‌ఆర్‌హెచ్ ట్రోఫీని ముద్దాడింది. 2016లో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మన తెలుగు జట్టు చరిత్ర సృష్టించింది. సన్‌రైజర్స్ సాధించిన రికార్డును ఇప్పటివరకు ఏ జట్టు బ్రేక్ చేయలేకపోయింది.

2016 సీజన్‌‌లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో కేకేఆర్‌పై 22 పరుగుల తేడాతో నెగ్గి క్వాలిఫయిర్-2కు క్వాలిఫై అయింది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్ కీలక మ్యాచ్‌లో మాత్రం చెలరేగింది. అనంతరం క్వాలిఫయిర్-2లో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

Sunrisers Hyderabad First Team in IPL History to Win Trophy After Playing in Eliminator

ఇక టైటిల్ పోరులో రాయల్ ఛాలెంర్స్ బెంగళూరు‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఏడు వికెట్లకు 208 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (69; 38 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో ఆర్సీబీ ఏడు వికెట్లు కోల్పోయి 200 పరుగులే చేసింది. క్రిస్ గేల్ (76; 38 బంతుల్లో, 4 ఫోర్లు, 8 సిక్సర్లు), విరాట్ కోహ్లి (54; 35 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు.

అయితే ఓ దశలో ఆర్సీబీ విజయానికి 44 బంతుల్లో 68 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. దీంతో బెంగళూరుకు తొలి టైటిల్ గెలిచినట్లే అని అనుకున్నారంతా. కానీ ఎస్‌ఆర్‌హెచ్ అద్భుతంగా పుంజుకుంది. గొప్పగా పోరాడి ట్రోఫీ గెలిచింది. అయితే ఎలిమినేటర్‌లో గెలిచి ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదే. మరే జట్టు ఇప్పటివరకు వరుసగా ఎలిమినేటర్, క్వాలిఫయిర్, ఫైనల్ గెలిచి కప్‌ను అందుకోలేదు. ఈ రికార్డు ఇప్పటికే పదిలంగానే ఉంది.

Story first published: Wednesday, May 29, 2024, 10:23 [IST]
Other articles published on May 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+