Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tanmay Agarwal: బంగారు బాతును వదిలేసిన సన్‌రైజర్స్!

హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీలో అరుణాచలప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అతడి వీరవిహారానికి పలు రికార్డులు బద్దలయ్యాయి. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతేగాక రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

తన్మయ్ అగర్వాల్ 181 బంతుల్లో 366 పరుగులు చేశాడు. 119 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన అతడు 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. 34 ఫోర్లు, 26 సిక్సర్లు బాదాడు. అయితే ఈ తెలుగు కుర్రాడు ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలానికి షార్ట్ లిస్ట్ కాలేకపోయాడు. గతేడాది డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే.

Sunrisers Hyderabad did mistake about Tanmay Agarwal? Who is Tanmay Agarwal?

అయితే గతంలో తన్మయ్ అగర్వాల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడు. ఇంటర్‌స్టేట్ టీ20 టోర్నీల్లో సత్తాచాటిన అతడిని 2017లో సన్‌రైజర్స్ రూ.10 లక్షలకు తీసుకుంది. 2018 సీజన్‌లోనూ అతడు జట్టుతోనే ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడేందుకు అతడికి జట్టు యాజమాన్యం అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత తన్మయ్‌ను ఎస్ఆర్‌హెచ్ వదులుకుంది.

2022వేలంలో తన అదృష్టాన్ని తన్మయ్ అగర్వాల్ పరీక్షించుకోగా అతడికి నిరాశే మిగిలింది. ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన అతడిపై ఏ జట్టు ఆసక్తి చూపలేదు. అయితే సంచలన రికార్డులు నమోదు చేయడంతో తన్మయ్ అగర్వాల్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అతడి వివరాల గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ పొరపాటు చేసిందని, బంగారు బాతు వంటి తన్మయ్‌ను విడిచిపెట్టిందని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపట్లేదని, తక్కువ అంచనా వేస్తున్నారా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత తెలుగు స్టార్ ప్లేయర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో లేని విషయం తెలిసిందే. మహ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో, తిలక్ వర్మ ముంబయి ఇండియన్స్‌లో, సిరిసిల్ల కుర్రాడు, అండర్-19 ప్లేయర్ అవనీశ్ రావ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నారు. అవనీశ్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంటుందని అందరూ భావించారు. కానీ ఎస్‌ఆర్‌హెచ్ ఆ కుర్రాడిపై ఆసక్తి చూపలేదు. దీంతో అతడిని రూ.20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. అయితే వైజాగ్‌కు చెందిన బౌలర్ నితీశ్ రెడ్డి ప్రస్తుతం సన్‌రైజర్స్‌ జట్టులోనే ఉన్నాడు.

Story first published: Saturday, January 27, 2024, 14:42 [IST]
Other articles published on Jan 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+