మా కావ్య పాపను ఏడిపిస్తున్నారు కదరా: ఆ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కోసమే సన్‌రైజర్స్ మ్యాచ్ చూస్తున్నాం

 Sunrisers Hyderabad CEO Kavya Maran has once again been targeted by fans after crushed by DC
Photo Credit: twitter
IPL 2021 : 'Mystery Girl' Kaviya Maran Trolled After SRH's Defeat VS DC || Oneindia Telugu

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పరాజయాన్ని మూట గట్టుకుంది. అపజయాల ఖాతాలో మరొకటి చేరింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టిన కేన్ సేన.. ఓడిపోయింది. భారీ స్కోర్ చేయలేక చేతులెత్తేసింది. తన ఖాతాలో మరో ఓటమిని జమ చేసుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలోనే నిలిచింది.

కడుపులా లేక చెరువులా: వారంలో వారు తిన్న బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు: బిత్తరపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకడుపులా లేక చెరువులా: వారంలో వారు తిన్న బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు: బిత్తరపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

134 పరుగులకే

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. భారీ స్కోర్ చేయలేకపోయింది. బలమైన ఢిల్లీ కేపిటల్స్‌కు నామమాత్రపు స్కోర్‌ను లక్ష్యంగా నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఏ మాత్రం ఎదురు నిలవలేకపోయింది..అలవోకగా తలవంచింది. కగిసో రబడ, ఎన్రిచ్ నోర్ట్జె బౌలింగ్‌కు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ల వద్ద సమాధామే లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకే ధాటికి కుప్పకూలింది.

తొలి ఓవర్‌లోనే షాక్

తొలి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్‌ వికెట్‌ను కోల్పోయిన తరువాత.. ఇక కోలుకోలేకపోయింది. వన్ బై వన్‌గా మిగిలిన బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ దారి పట్టారు. చివర్లో అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్ కొంత ప్రతిఘటించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అబ్దుల్ సమద్ 28 పరుగులు, రషీద్ ఖాన్ 22 పరుగులు చేశారు. వారిద్దరే టాప్ స్కోరర్లు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా నిరుత్సాహ పరిచారు.

ఎనిమిది వికెట్ల తేడాతో..

ఛేదించాల్సిన లక్ష్యంతో పరిమితంగా ఉండటంతో ఢిల్లీ కేపిటల్స్ ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడింది. తొలి ఓవర్లలోనే పృథ్వీ షా వికెట్‌ను కోల్పోయినప్పటికీ పెద్దగా టెన్షన్ పడలేదు. దూకుడుగా ఆడింది. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ చాన్నాళ్ల తరువాత జోరు ప్రదర్శించాడు. 37 బంతుల్లో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లతో 42 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక మరో వికెట్‌ను కోల్పోలేదు ఢిల్లీ, మాజీ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ప్రజెంట్ కేప్టెన్ రిషభ్ పంత్.. భారీ షాట్లతో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. వారిద్దరూ నాటౌట్‌గా నిలిచారు.

హైదరాబాద్ ఫ్యాన్స్ ఇరిటేట్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాల పరంపర ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఇరిటేట్ చేస్తోంది. తమ అసహనాన్ని, అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తోన్నారు. ఈ విషయంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌ను మళ్లీ టార్గెట్ చేస్తోన్నారు. హైదరాబాద్ ఈ సారి కూడా ఉత్త చేతుల్లో వెనక్కి రావడం ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెబుతున్నారు. ప్లే ఆఫ్‌కు కూడా చేరదని, వచ్చే మ్యాచ్‌లల్లోనూ గెలవడం కష్టమేనని చెబుతున్నారు.

కావ్య పాప కోసమే..

సన్‌రైజర్స్ మ్యాచ్‌ను కేవలం కావ్య మారన్ కోసమే చూస్తోన్నామని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ఈ టీమ్ తన టాలెంట్, అగ్రెసివ్ నెస్‌ను కోల్పోయిందని చెబుతున్నారు. నిస్సారంగా ఆడుతున్నారని, టీ20 ఫార్మట్‌లో ఎలా ఆడాలో కూడా తెలియనట్లుగా తయారయ్యారని అంటున్నారు. స్టేడియంలో కనిపించే కావ్య మారన్ మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటున్నారని, ఆమె కోసమే మ్యాచ్ చూస్తున్నామని చెబుతున్నారు ఫ్యాన్స్.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, September 23, 2021, 11:21 [IST]
Other articles published on Sep 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X