కావ్య పాప కన్‌ఫ్యూజన్.. పాపం ఇషాన్ కిషన్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. అయితే జట్టు విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో కెప్టెన్సీకి సంబంధించి ఓ పెద్ద చర్చ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుతో చేరడంతో ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఇషాన్ కిషన్ నుంచి బాధ్యతలు వెనక్కి తీసుకుంటారా.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అనూహ్యంగా కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
ఈ సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో జట్టు యాజమాన్యం అనూహ్యంగా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఆరంభంలో కొన్ని ఓటములు ఎదురైనప్పటికీ.. ఇషాన్ కిషన్ తన నాయకత్వ పటిమతో జట్టును మళ్లీ విజయాల బాట పట్టించాడు. ముఖ్యంగా బౌలర్లను ఉపయోగించుకోవడంతో, ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఇషాన్ కిషన్ చూపిన పరిణతికి మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సంజయ్ బంగర్ వంటి వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

హర్భజన్ సింగ్ మద్దతు
ఇషాన్ కిషన్ కెప్టెన్సీని కొనసాగించాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ గట్టిగా వాదిస్తున్నారు. "హైదరాబాద్ జట్టు ప్యాట్ కమిన్స్ వైపు వెళ్లాలనే ఆలోచనను ఇప్పుడే పక్కన పెట్టాలి. ప్రస్తుత సెటప్‌లో ఇషాన్ కిషన్ సారథ్యంలో జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తోంది. గత 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన జట్టులో మార్పులు చేయడం అనవసరం" అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కమిన్స్ 2024లో జట్టును ఫైనల్‌కు చేర్చినప్పటికీ.. ప్రస్తుత ఫామ్ ఇషాన్‌కు అనుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కమిన్స్ ఫిట్‌నెస్‌పై సంజయ్ బంగర్ సందేహాలు
మాజీ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి ఆయన ఓ వ్యూహాత్మక కారణాన్ని వెల్లడించారు. ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడని.. దీనివల్ల అతను గత టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్యాట్ కమిన్స్.. ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీలో పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉంటాడా అన్నది సందేహమని విజయ్ బంగర్ పేర్కొన్నారు. ఇషాన్ కిషన్ గ్రౌండ్లో ఆటను నియంత్రించే తీరు అద్భుతంగా ఉందని సంజయ్ బంగర్ కొనియాడారు.
సంకటంలో సన్‌రైజర్స్ యాజమాన్యం
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇప్పుడు ఓ ధర్మసంకటంలో పడింది. ఓ వైపు ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులోకి రావడం.. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న యువ కెప్టెన్ ఇషాన్ కిషన్. ఈ నిర్ణయం సీజన్ మలిదశలో జట్టు ప్రదర్శనపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఆరెంజ్ ఆర్మీ అనుభవానికి ఓటేస్తుందో లేక విజయం తెచ్చిపెడుతున్న యువ రక్తాన్ని నమ్ముతుందో వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications