For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: కేన్ మామ వ‌చ్చేశాడు.. ఇక గ్రౌండులోకి దిగ‌డ‌మే ఆల‌స్యం.. ఈ సారి క‌ప్ కొట్టాలంతే..

Sunrisers Hyderabad Captain Kane Williamson Joins Team, Can He Change The Fortune Of SRH In IPL 2022

హైద‌రాబాద్‌: ఐపీఎల్ 2022కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. నేటి నుంచి ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభ‌మ‌వ‌డానికి స‌రిగ్గా 10 రోజులు మాత్ర‌మే ఉంది. దీంతో టీంల‌న్నీ ఇప్ప‌టికే త‌మ స్పెష‌ల్ క్యాంపుల‌ను ప్రారంభించి ప్రాక్టీసు మొద‌లుపెట్టేశాయి. ఈ క్ర‌మంలోనే గ‌త సీజ‌న్లో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్టడుగును నిలిచి తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ సారి స‌త్తా చాటాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతుంది.

కేన్ మామ వ‌చ్చేశాడు

కేన్ మామ వ‌చ్చేశాడు

ఐపీఎల్‌కు స‌మ‌యం ఆస‌న్నమ‌వ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు స్పెష‌ల్ క్యాంపు ఏర్పాటు చేసింది. తాజాగా జ‌ట్టు కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ ఈ స్పెష‌ల్‌ క్యాంపులో జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 25 సెక‌న్ల‌పాటు ఉన్న ఈ వీడియోలో కేన్ విలియ‌మ్స‌న్ న‌డిచి రావ‌డం ఆక‌ట్టుకుంటుంది.

‘‘స‌డెన్‌గా స‌మ్మ‌ర్ కూల్‌గా అనిపిస్తోంది అంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క్యాంపులోకి ఎవ‌రో అడుగుపెడుతున్నారు. వెల్‌క‌మ్ కేన్ మామ'' అంటూ ఈ వీడియోకు పోస్టును జ‌త చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ షెడ్యూల్

ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 29న ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఏప్రిల్ 4న పుణే సూప‌ర్ జెయింట్స్‌తో, 9న చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో, 11న గుజ‌రాత్ టైటాన్స్‌తో, 15న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో, 17న పంజాబ్ కింగ్స్‌తో, 23న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో, 27న గుజ‌రాత్ టైటాన్స్‌తో, మే 1న చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో, 5న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, 8న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో, 14న కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌తో, 17న ముంబై ఇండియ‌న్స్‌తో, 22న చివ‌ర‌గా పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. మొత్తం లీగ్ స్టేజ్‌లో హైద‌రాబాద్ 14 మ్యాచ్‌లు ఆడ‌నుంది.

SRH Fans Slams Management About SRH Camp In Chennai | Oneindia Telugu
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి స్క్వాడ్

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి స్క్వాడ్

కేన్ విలిమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్( రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుంధర్ (రూ.8.75 కోట్లు), నికోలస్ పూరన్ (రూ. 10.75 కోట్లు), నటరాజన్ (రూ.4 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.2 కోట్లు), ప్రియామ్ గార్గ్ (రూ. 20 లక్షలు), రాహుల్ త్రిపాఠి (8.50 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు), కార్తీక్ త్యాగీ (రూ.4 కోట్లు), జగదీష సుచిత్ (రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ. 75 లక్షలు), ఎయిడెన్ మార్క్‌రమ్ (రూ.2.60 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ.4 కోట్లు), రొమారియో షెఫెర్డ్ (రూ.7,75 కోట్లు).

Story first published: Wednesday, March 16, 2022, 12:34 [IST]
Other articles published on Mar 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+