Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నో అభిషేక్, నో క్లాసెన్: SRH గేమ్ ఛేంజర్లు వాళ్లే: టీమిండియా మాజీ స్టార్

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్ పలు రికార్డులను తిరగరాసింది. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తాను ఎంత గొప్ప బ్యాటరో నిరూపించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 350 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ సిక్సర్స్ ఇవి.

సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విధానంపై టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ వసీం జాఫర్ స్పందించాడు. అన్‌క్యాప్డ్ పేసర్ సాకిబ్ హుస్సేన్, ఈషాన్ మలింగలపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. వారిద్దరిని గేమ్ ఛేంజర్లుగా అభివర్ణించాడు. మ్యాచ్ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌లో జాఫర్ మాట్లాడాడు. 21 ఏళ్ల సాకిబ్ బౌలింగ్ యాక్షన్ ప్రత్యేకమైనదని, బ్యాటర్లకు స్లో బాల్‌నా లేదా ఫాస్ట్ డెలివరీనా అర్థం చేసుకోవడం కష్టమని వివరించాడు.

Sunrisers Hyderabad bowling gains momentum with Sakib Hussain and Eshan Malinga says Wasim Jaffer

సాకిబ్ హుస్సేన్ బౌలింగ్ యాక్షన్ అద్భుతంగా ఉంటుందని, చాలా ప్రత్యేకమైనదని వసీం జాఫర్ చెప్పాడు. అతను వేసేది స్లో బాల్ లేదా ఫాస్ట్ డెలివరీ అని ముందే గ్రహించడం బ్యాటర్లకు కష్టమని, దాని గురించి ఎటువంటి అంచనా వేయలేరని చెప్పాడు. స్పీడ్ అండ్ స్లోయర్ డెలివరీలను సాకిబ్ చాలా బాగా మిక్స్ చేస్తాడని కితాబిచ్చాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓ ఆణిముత్యంగా అభివర్ణించాడు. అతని వద్ద స్లో బాల్స్, యార్కర్లు ఉన్నాయని, ఈ ఫార్మాట్‌లో వేరియేషన్స్ తో సంధించగలడని పేర్కొన్నాడు.

ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 14.16, స్ట్రైక్ రేట్ 12.0, ఎకానమీ రేట్ 7.08గా నమోదయ్యాయి. మరో బౌలర్ ఈషాన్ మలింగను సైతం ప్రశంసించాడు జాఫర్. అతని బౌలింగ్ చాలా మెరుగుపడిందని, అది జట్టుకు ఎంతగానో విలువైనదని అన్నాడు. ఢిల్లీ కేపిటల్స్‌పై అతని బౌలింగ్, వికెట్లు పడగొట్టిన తీరు ఆకట్టుకున్నాయని చెప్పాడు.

సాకిబ్, నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ల ప్రదర్శనతో సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ పదునెక్కిందని అభిప్రాయపడ్డారు. ఈషాన్ మలింగ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడని, మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత అతను క్రమంగా మెరుగుపడ్డాడని చెప్పాడు, ఢిల్లీ కేపిటల్స్ పై కూడా అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆల్ రౌండర్ గా మంచి పాత్ర పోషిస్తున్నాడని, ఇది ఇలాగే కొనసాగితే ప్రఫుల్ హింజ్, శివాంగ్ వంటి బౌలర్లు సన్ రైజర్స్ లో కీలకంగా ఉన్నారని గుర్తు చేశాడు.

Story first published: Wednesday, April 22, 2026, 12:51 [IST]
Other articles published on Apr 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+