IPL 2021 Auction: ఐదుగురిని వదిలి.. ముగ్గురినే తీసుకున్న సన్‌రైజర్స్! వేలం తర్వాత పూర్తి జట్టు ఇదే!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలం ఊహించినదానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. జరిగింది మినీ వేలమే అయినా.. ఫ్రాంచైజీలు అత్తగాళ్ల కోసం పోటీపడ్డాయి. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు ఏమాత్రం దృష్టిలో పెట్టుకోలేదు. వారిపై పూర్తి నమ్మకం ఉంచాయి. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది. ఆటగాళ్ల కోసం ఒక్కో ప్రాంచైజీ పోటీపడగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) మాత్రం వేలం పాటను చూడడానికే వచ్చినట్టు అనిపించింది. ముగ్గురు క్రికెటర్లను మాత్రమే జట్టులోకి తీసుకుంది.

మలిదశలో జాదవ్‌ని కొనుగోలు:
చెన్నైలో గురువారం జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ముగ్గురు ఆటగాళ్లని మాత్రమే కొనుగోలు చేసింది. ప్రతిభావంతులైన ప్లేయర్లను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించినా.. బడ్జెట్ లేకపోవడంతో ముందుకెళ్లలేకపోయింది. కేదార్ జాదవ్‌ను తొలి దశలో ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో మలి దశలో రూ.2 కోట్లకు కైవసం చేసుకున్నది. వేలం మరి కొన్ని నిమిషాల్లో ముగుస్తున్న దశలో మళ్లీ జాదవ్‌ని వేలంలోకి తీసుకురాగా.. అప్పుడు దక్కిచుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కి గత ఏడాది భారంగా మారిన జాదవ్‌ని రూ.2 కోట్లకి కొనుగోలు చేయడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

చివరలో ముజీబ్, సుచిత్:
ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ (రూ.1.5 కోట్లు) విషయంలోనూ అదే జరిగింది. వేలం చివరలో ఎస్ఆర్‌హెచ్ కొనుగులు చేసింది. జగదీశ సుచిత్ (రూ.30 లక్షలు) ఎడమచేతి వాటం స్పిన్నర్ కావడంతో.. టీమ్‌లోకి తీసుకుంది. మొత్తంగా వేలంలో ఏ ఫ్రాంఛైజీతోనూ హైదరాబాద్ పెద్దగా పోటీపడలేదు. ఐపీఎల్ 2021 వేలానికి ఇటీవల బిల్లీ స్టాన్లేక్, ఫ్యాబియన్ అలెన్, బవనాక సందీప్, సంజయ్ యాదవ్, పృథ్వీ రాజ్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసింది. దాంతో రూ.10.75 కోట్ల పర్సు మనీతో గురువారం వేలానికి వెళ్లిన హైదరాబాద్.. రిలాక్స్‌గా కనిపించింది.

హైదరాబాద్ జట్టు:
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, బాసిల్ థంపీ, భువనేశ్వర్ కుమార్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షబాజ్ నదీమ్, శ్రీవాత్సవ గోస్వామి, సిద్ధార్థ కౌల్, ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, కేదార్ జాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మన్, జగదీశ సుచిత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications