
సన్‌రైజర్స్ భారీ ధర..
భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అదరగొట్టాడు. ఓపెనర్‌గా వచ్చి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం కేన్ విలియమ్సన్‌ను వదిలేసుకున్న సన్‌రైజర్స్ వద్ద నిఖార్సయిన ఓపెనర్ లేడు. ఆ లోటును కామెరూన్ గ్రీన్‌తో భర్తీ చేయాలని మాక్ వేలంలో సన్‌రైజర్స్ భావించింది. అందుకే ఏకంగా రూ.20 కోట్లు పెట్టి కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసింది.

కర్రాన్ కోసం చెన్నై
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టీ20 వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన శామ్ కర్రాన్ కోసం కూడా ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడ్డాయి. అతన్ని ఎలాగైనా చెన్నై సూపర్ కింగ్స్‌కు అందించాలని సురేశ్ రైనా కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే ఏకంగా రూ.19.5 కోట్లు పెట్టి కర్రాన్‌ను చెన్నైకి కొన్నాడు. చెన్నైలో కర్రాన్ చాలా కీలకమైన ఆటగాడిగా మారతాడని రైనా పదే పదే చెప్తున్న సంగతి తెలిసిందే. అందుకే అంత ఖర్చు పెట్టాడు.

స్టోక్స్ కోసం పంజాబ్ భారీ ధర
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా బెన్ స్టోక్స్‌ను చెప్తారు. అతని కోసం కూడా వేలంలో గట్టి పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే మాక్ వేలంలో కూడా స్టోక్స్ కోసం గట్టిగా పోటీ జరిగింది. చివరకు పంజాబ్ కింగ్స్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. అతని కోసం పంజాబ్ ఫ్రాంచైజీ తరఫున రూ.19 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. స్టోక్స్ చేరికతో పంజాబ్ లోయర్ ఆర్డర్ మరింత బలంగా మారుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

స్మిత్ కోసం ముంబై పోటీ
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్ కోసం కూడా గట్టి పోటీ ఉంటుందని నిర్వాహకులు అంచనా వేశారు. మాక్ వేలంలో భాగంగా అతని కోసం కూడా ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడ్డాయి. అయితే చివరకు ముంబై ఇండియన్స్ జట్టు అతన్ని రూ.8.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా తనదైన రోజున ఎలాంటి మ్యాచ్ అయినా గెలిపించగల సత్తా స్మిత్ సొంతం. అందుకే అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

పూరన్‌ను టార్గెట్ చేసిన లక్నో
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వదిలేసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కోసం కూడా గట్టి పోటీ నెలకొంది. టీ10 లీగులో రాణించిన అతన్ని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతని కోసం రూ.8.5 కోట్లు ఖర్చు పెట్టింది. లక్నో జట్టులో కూడా లోయర్ ఆర్డర్ అంత బలంగా లేదు. దీంతో పూరన్ చేరికతో ఆ విభాగం బలంగా మారుతుందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications












