Southafrica T20 League : సన్‌రైజర్స్ హైదరాబాద్ కొన్న జట్టు పేరు ఇదే.. ఇప్పటివరకు ఏం టీంలో ఎవరంటే..?

ఇటీవలే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఆడేందుకు ఓ జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని పేరు పెట్టినట్లు సన్ రైజర్స్ ప్రకటించింది. పోర్ట్ ఎలిజబెత్ ఆధారిత ఫ్రాంచైజీని కొనుక్కున్న సన్ రైజర్స్.. తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఫ్రాంచైజీ పేరును ప్రకటించింది. సీఎస్ఏ టీ20 ప్రారంభ సీజన్‌కు ముందు జట్టు ఇప్పటికే ఐడెన్ మార్క్‌రామ్‌తో ఒప్పందం చేసుకుంది. 27ఏళ్ల మార్కరమ్ ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అతను 14 మ్యాచ్‌లలో 381పరుగులు చేసి రాణించాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది. 14గేమ్‌లలో 12పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్ మినీ వర్షన్ అనే పేరు
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సీఎస్ఏ టీ20 లీగ్‌లోని వివిధ జట్లలో తమ వాటాలను కలిగి ఉన్నాయి. ఇక సీఎస్ఏ టీ20 లీగ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించనప్పటికీ ఈ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మినీ వెర్షన్ అనే పేరొచ్చింది. ఐపీఎల్ మాదిరిగానే దక్షిణాఫ్రికా కూడా సీఏఎస్ఏ T20 లీగ్ తప్పకుండా విజయవంతం అవుతుందని మాజీ ప్లేయర్ లాన్స్ క్లూసెనర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికా బోర్డు అనేక ప్రయత్నాల తరువాత
గతంలో తమ దేశంలో ప్రత్యేక ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని సౌతాఫ్రికా బోర్డు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైంది. అయితే తాజాగా అన్ని ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు తొలి సీఎస్ఏ టీ20 లీగ్ పట్టాలెక్కబోతుంది. దక్షిణాఫ్రికా బోర్డు ఈ లీగ్‌ను ప్రపంచంలోనే 2వ అత్యుత్తమ టీ20 లీగ్‌గా పేర్కొంటోంది. మొత్తం ఆరు ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. ఆరు టీంలను కొనుగోలు చేయడంతో.. తప్పకుండా ఈ టీ20 లీగ్‌కు విశేష ఆదరణ దక్కుతుందని ఆ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. జనవరి నెలలో జరిగే ఈ టోర్నమెంట్‌కు ఆటగాళ్లు అందుబాటులో ఉండేందుకు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ను కూడా దక్షిణాఫ్రికా బోర్డు రద్దు చేసుకోవడం గమనార్హం.

ఇప్పటివరకు 6ఫ్రాంచైజీలకు సంతకం చేసిన ఆటగాళ్ల జాబితా :
చెన్నై సూపర్ కింగ్స్ (జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ ) : ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, మహేశ్ తీక్షణ, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్రిటోరియా క్యాపిటల్స్ ): అన్రిచ్ నోర్జ్, మిగెల్ ప్రిటోరియస్
ముంబై ఇండియన్స్ (ఎంఐ కేప్ టౌన్ ): రషీద్ ఖాన్, కగిసో రబడా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్
రాజస్థాన్ రాయల్స్ (పార్ల్ రాయల్స్ ): జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, ఒబెడ్ మెక్‌కాయ్, కార్బిన్ బాష్
సన్ రైజర్స్ హైదరాబాద్ (సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ): ఐడెన్ మార్క్‌రామ్, ఒట్నీల్ బార్ట్‌మాన్
లక్నో సూపర్ జెయింట్స్ (డర్బన్ సూపర్ జెయింట్స్) : క్వింటన్ డి కాక్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టాప్లీ, ప్రేనెలన్ సుబ్రాయెన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications