Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ మామకు టఫ్ ఫైట్: ఆరెంజ్ ఆర్మీ కఠోర సాధన: బలమైన ప్రత్యర్థితో తొలి మ్యాచ్..వివరాలివే

Sunrisers Hyderabad aim for winning start against Rajasthan Royals on March 29

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. మూడు మ్యాచ్‌లు ముగిసిపోయాయి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ కేపిటల్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. రెండు, మూడు స్థానాల్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్ నిలిచాయి. ఇప్పటిదాకా గెలుపు రుచిని చూసింది- ఈ మూడు జట్లే. ఇవ్వాళ- రెండు కొత్త జట్లు తలపడబోతోన్నాయి. ఈ సాయంత్రం ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.

 సన్‌రైజర్స్..రైజింగ్ ఎప్పుడు

సన్‌రైజర్స్..రైజింగ్ ఎప్పుడు

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ వంతు వచ్చింది. మంగళవారం ఆరెంజ్ ఆర్మీ బరిలోకి దిగబోతోంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో పింక్ టీమ్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాలని కేన్ విలియమ్సన్ అండ్ హిస్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగా కఠోర సాధన చేస్తోంది.

 నో స్టార్స్..

నో స్టార్స్..

ఇదివరకట్లా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పెద్దగా స్టార్లు లేరు. అంతకుముందు డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో.. వంటి విన్నింగ్ హార్సెస్- జట్టుకు గుడ్‌బై చెప్పారు. మెగా వేలంపాట సందర్భంగా వేర్వేరు ఫ్రాంఛైజీల్లో జాయిన్ అయ్యారు. ఒకరకంగా చూస్తే సన్‌రైజర్స్ వద్ద ఉన్నవి పరిమిత బ్యాటింగ్, బౌలింగ్ వనరులే. కేన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్, గ్లెన్ ఫిలిప్స్, రొమారియో షెప్పర్డ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, ప్రియం గర్గ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మలిక్, వాషింగ్టన్ సుందర్..వంటి ప్లేయర్లు ఉన్నారు.

 కేన్-ఫిలిప్స్ ఓపెనింగ్..

కేన్-ఫిలిప్స్ ఓపెనింగ్..

ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్-గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్‌ను ఆరంభించే అవకాశం ఉంది. టాప్, మిడిలార్డర్ భారాన్ని నికొలస్ పూరన్, ప్రియంగర్గ్, రాహుల్ త్రిపాఠి మోయాల్సి ఉంటుంది. విలియమ్సన్ గనక నంబర్ 3 పొజీషన్‌లో బ్యాటింగ్‌కు దిగాల్సి వస్తే- రవికుమార్ సమర్థ్-అబ్దుల్ సమద్ ఇన్నింగ్‌ను ఆరంభిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉన్నప్పటికీ.. ఎంతవరకు నిలకడగా రాణిస్తారనేదే ఆసక్తి రేపుతోంది.

బలంగా బౌలింగ్..

బలంగా బౌలింగ్..

ఆరెంజ్ ఆర్మీలో బ్యాటింగ్ కంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఒకింత బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, శ్రేయాస్ గోపాల్, జే సుచిత్ బౌలింగ్ విభాగంలో ఉన్నారు. హైదరాబాద్‌తో పోల్చుకుంటే- రాజస్థాన్ రాయల్స్ స్టార్లతో నిండివుంది. సంజు శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, యజువేందర్ చాహల్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్ నాథన్ కౌల్టర్ నీల్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ.. ఈ జట్టులో ఉన్నారు. వీరిని ఎలా ఎదుర్కొంటుందనేది చర్చనీయాంశమైంది.

Story first published: Monday, March 28, 2022, 16:39 [IST]
Other articles published on Mar 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+