Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌లో ఈ మార్పులపై వెటోరీ మామ ఫోకస్..తలరాత మారేనా?

వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్‌గా బ్రయాన్ లారా కాంట్రాక్టు ముగియడంతో కివీస్ లెజెండ్ డానియల్ వెటోరీని ఈ స్థానంలో తీసుకుంది. వచ్చే ఏడాది సన్‌రైజర్స్ రాణించాలంటే.. అతను టీంలో ఈ మూడు విషయాలపై ఫోకస్ పెట్టాలి.

మార్క్రమ్ మామ ఓకేనా?: ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా సఫారీ స్టార్ ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నాడు. కానీ ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఇది సరైన నిర్ణయం కాదేమో? జట్టుపై అతని ప్రభావం అంతగా ఉన్నట్లు కనిపించడం లేదు.

Daniel Vettori

అంతేకాదు, మైదానంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే సమయంలో మార్క్రమ్ తేలిపోతున్నాడు. కాబట్టి అతన్ని కెప్టెన్‌గా కొనసాగించాలా? లేక కొత్త వాళ్లకు జట్టు పగ్గాలు అందించాలా? అనేద ఆలోచించాలి.

బ్యాటింగ్‌పై ఫోకస్: ఈ ఏడాది ఐపీఎల్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో సన్‌రైజర్స్ ఒకటి. కానీ కీలకమైన ఒక్క మ్యాచులోనూ ఈ టీం ఆశించిన స్కోరు చేయలేదు. దీంతో జట్టు బ్యాటింగ్ లైనప్‌పై పలు సందేహాలు తలెత్తాయి.

హ్యారీ బ్రూక్‌ను ఓపెనర్‌గా పంపినా, మిడిలార్డర్‌లో పంపినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఈ ఐపీఎల్ సీజన్ అంతా టీం బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంది. ఏ ఒక్కరూ ఒక ప్లేస్‌లో నిలకడగా లేరు. ఇలాంటి మార్పులకు వెటోరీ ఫుల్‌స్టాప్ పెట్టాలి.

పదే పదే మార్పులు: ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక మార్పులతో బరిలో దిగిన జట్టు సన్‌రైజర్స్. ఇక వాషింగ్టన్ సుందర్‌కు గాయమైన తర్వాత ఈ డైలమా మరింత పెరిగింది. ఉమ్రాన్ వంటి బౌలర్లకు అవసరమైనన్ని ఓవర్లు దక్కలేదు.

ఇదేంటని ప్రశ్నిస్తే.. మార్క్రమ్ వద్ద కూడా సరైన సమాధానం లేకుండా పోయింది. ఇక గ్లెన్ ఫిలిప్స్, అదిల్ రషీద్, ఫజల్లాక్ ఫరూఖీ వంటి క్వాలిటీ ప్లేయర్లకు కూడా ఆ టీంలో ఆశించిన అవకాశాలు దక్కలేదు. వెటోరీ ఈ సమస్యలపై ఫోకస్ పెట్టి, వచ్చే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ మెరుగైన ప్రదర్శన చేసేలా చేయాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, August 9, 2023, 15:42 [IST]
Other articles published on Aug 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+