ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ చూసేందుకు లేదా ఆడేందుకు తమకు సంబంధించిన ముఖ్యమైన, విలువైన పనులను కూడా పక్కనపెట్టేస్తుంటారు చాలా మంది అభిమానులు/ క్రికెటర్లు. అంతలా క్రికెట్.. అభిమానులతో అనుబంధాన్ని ముడివేసుకుంది. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. సన్ రైజర్స్ క్రికెటర్.. సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం ఫైనల్ మ్యాచ్ కోసం ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు.
అతడెవరంటే?
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న SA20 లీగ్ తాజాగా ముగిసింది. మూడో సారి టైటిల్ ను ముద్దాడాలని ఆశించిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఆశలపై ముంబయి నీళ్లు చల్లింది. కప్ ను ముంబయి ఎగరేసుకుపోయింది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎలాగైనా రాణించి, జట్టుకు విజయాన్ని అందుకోవాలనుకున్న సన్ రైజర్స్ క్రికెటర్ డేవిడ్ బెడింగ్ హామ్.. ఈ మ్యాచ్ కోసం తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. శనివారమే జరగాల్సిన తన పెళ్లిని.. ఆదివారానికి వాయిదా వేసుకున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ రిపోర్టర్ ఫిర్దోస్ పేర్కొన్నాడు.

'' బెడింగ్ హామ్ పెళ్లి జెన్నా వాన్ నీకెర్క్‌తో నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన్న అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ సన్ రైజర్స్ ఫైనల్స్ కు దూసుకెళ్లడంతో అతడు పెళ్లి చేసుకోకపోవడంతో ఆగిపోయాడు. వివాహాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నాడు'' అని వెల్లడించాడు.
ఈ విషయమై బెడింగ్ హామ్ కూడా స్పందించాడు. ''నాకు కాబోయే భార్య జెన్నా.. మేము క్వాలిఫయర్ లో ఓడిపోతామని ముందుగా అంచనా వేసింది. కానీ మేం ఫైనల్ కు వెళ్లాలని ఆమె ఆకాంక్షించింది. అలానే మేం ఫైనల్ కు వెళ్లాం. అలాగే మా వివాహం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగలాని చెప్పింది.'' అని బెడింగ్‌హామ్ చెప్పుకొచ్చాడు.
కాగా, SA20 2025 ఫైనల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. MI కేప్‌టౌన్ టైటిల్ ను సొంతం చేసుకుంది.