Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SAT20 Sunrisers: కెప్టెన్ ఇన్నింగ్స్ తో కావ్య పాప టీమ్ ధనాధన్!!

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ మరోసారి తన దూకుడు ప్రదర్శనతో ఆకట్టుకుంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా తాజా సీజన్ లో దూసుకెళ్తోన్న ఆ జట్టు.. తాజాగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించి క్వాలిఫయర్‌-2లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ను 32 పరుగులు తేడాతో ఓడించింది.

సెంచూరియన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన సూపర్‌ కింగ్స్‌ మొదట బౌలింగ్‌ కు దిగింది. దీంతో బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 62 అజేయ పరుగులు చేశాడు.

Sunrisers Eastern Cape beats Joburg Super Kings by 32 runs and entered into SA20 Qualifier 2

ఓపెనర్లు ఓపెనర్‌ బెడింగ్‌హాం(27), టోనీ డి జోర్జి(14)తో పాటు జోర్డాన్‌ హెర్మాన్‌(12), అబెల్‌(10), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (26).. ఆఖర్లో మార్కో జాన్సెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌(12 బంతుల్లో 23)తో ఆకట్టుకున్నాడు. జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌, విల్‌జోయెన్‌ తలో రెండు వికెట్లు తీయగా.. మహీశ్‌ తీక్షణ, మొయిన్‌ అలీ చెరో వికెట్ తీశారు.

లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది సూపర్ కింగ్స్. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఇవాన్‌ జోన్స్‌(22 నాటౌట్‌) పర్వాలేదనిపించాడు. డెవాన్‌ కాన్వే(30), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(19), విహాన్‌ ల్యూబే(13), జేపీ కింగ్‌(9), హార్డస్‌ విల్‌జోయెన్‌(14), మొయిన్‌ అలీ(0), విఫలమయ్యారు. దీంతో 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌.. క్వాలిఫయర్‌-2కు అర్హత పొందింది.

క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పార్ల్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు టైటిల్ పోరులో ముంబయి ఇండియన్స్‌ కేప్‌టౌన్‌తో పోటీపడనుంది.

Story first published: Thursday, February 6, 2025, 10:50 [IST]
Other articles published on Feb 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+