Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్య మారన్ జట్టుకు కొత్త కెప్టెన్: ఛాంపియన్ కెప్టెన్‌ స్థానంలో యువ క్రికెటర్

Kavya Maran: సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. కావ్య మారన్ యాజమాన్యంలోని ఈ జట్టుకు రాబోయే SA20 లీగ్‌లో 25 ఏళ్ల యువ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవలి కాలంలో తన బ్యాటింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ట్రిస్టన్ స్టబ్స్‌కు, జట్టు యాజమాన్యం ఈ బాధ్యతలు అప్పగించింది.

ఛాంపియన్ కెప్టెన్ స్థానంలో యువ క్రికెటర్
SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు గతంలో ఎయిడెన్ మార్‌క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. మార్‌క్రమ్ నాయకత్వంలో ఈ జట్టు వరుసగా రెండు సార్లు (2023, 2024) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈసారి ఫ్రాంచైజీ మార్‌క్రమ్ ను రీటైన్ చేయకపోవడం గమనార్హం. దీంతో అతను డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుకు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాడు. మార్‌క్రమ్ స్థానంలో, SA20 లీగ్ తొలి సీజన్ నుంచి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టులో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.

Sunrisers Eastern Cape Appoint Tristan Stubbs as New Captain for SA20 League

స్టబ్స్ అద్భుతమైన ప్రదర్శన
25 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ ఒక పవర్ హిట్టర్‌గా ప్రసిద్ధి చెందాడు. SA20 లీగ్ గత మూడు సీజన్లలో అతను మొత్తం 723 పరుగులు సాధించాడు. ఈ పరుగులు 140.11 స్ట్రైక్ రేట్‌తో చేయడం విశేషం. సన్‌రైజర్స్ ఈసారి స్టబ్స్‌ను రిటైన్ చేసుకుంది.SA20 లీగ్ నాలుగో సీజన్ కోసం జరిగిన ఆక్షన్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. డెవాల్డ్ బ్రెవిస్, ఈ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు కూడా ఈసారి ఆక్షన్‌లో 14 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిలో ప్రముఖ ఆటగాళ్లైన క్వింటన్ డి కాక్, ఎన్రిక్ నోర్ట్జే, మ్యాథ్యూ బ్రీట్జ్కే వంటి వారు ఉన్నారు.

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఆటగాళ్ల జాబితా ఇదే:
ట్రిస్టన్ స్టబ్స్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మ్యాథ్యూ బ్రీట్జ్కే, అల్లా గజన్‌ఫర్, ఆడమ్ మిల్నే, ఎన్రిక్ నోర్ట్జే, జోర్డాన్ హర్మన్, సెనురన్ ముత్తుసామి, మిచెల్ వాన్ బురెన్, క్రిస్ వుడ్, సీజే కింగ్, జేపీ కింగ్, లూయిస్ గ్రెగరీ, పాట్రిక్ క్రూగర్, బేర్స్ స్వాన్‌పూల్, లూథో సిపామ్లా.

Story first published: Wednesday, September 10, 2025, 12:40 [IST]
Other articles published on Sep 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+