Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర స‌‌ృష్టించిన సన్‌రైజర్స్.. సంచలన విజయం!

సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎస్ఏ టీ20 లీగ్ చరిత్రలోనే ప్రత్యర్థి జట్టును అత్యల్ప స్కోరుకు కట్టడి చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్ర సృష్టించింది. సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో ప్రిటోరియాను చిత్తు చేసింది.

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్లు సాల్ట్ (10), విల్ జాక్స్ (12)దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. కానీ మూడో ఓవర్ ఆఖరి బంతికి అసలు కథ మొదలైంది. 25 పరుగుల వద్ద సాల్ట్‌ను డేనియల్ వోరల్ ఔట్ చేశాడు. అనంతరం కాసేపట్లోనే క్యాపిటల్స్ 33 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాట్లర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

Sunrisers created history in SA20 and Sensational victory against Pretoria Capitals

ఈ దశలో క్యాపిటల్స్ కెప్టెన్ పార్నల్ (9; 14 బంతుల్లో), ఈథన్ (1; 10 బంతుల్లో)తో కలిసి టెస్టు మోడ్‌లోకి వెళ్లి వికెట్లను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. కానీ సన్‌రైజర్స్ బౌలర్లు వాళ్లకి ఆ అవకాశం ఇవ్వలేదు. వికెట్ల వేట కొనసాగిస్తూ 13.3 ఓవర్లలోనే 52 పరుగులకు ఆలౌట్ చేశారు. ఎస్ఏ టీ20 లీగ్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు. సన్‌రైజర్స్ బౌలర్లలో బార్ట్‌మన్ నాలుగు వికెట్లు, డేనియల్ వోర్నల్ మూడు, మార్కో జేన్సన్ రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. నెట్ రన్ రేటును మెరుగుపర్చుకుని బోనస్ పాయింట్ కూడా సాధించుకుంది. అయితే ఓపెనర్ డేవిడ్ మలన్ (1) రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన టామ్ అబెల్ (31*; 22 బంతుల్లో)తో కలిసి మరో ఓపెనర్ హెర్మన్ (20; 17 బంతుల్లో) దూకుడుగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ విజయంతో సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లో ఆడిన సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఓటమిపాలవ్వగా మరో మ్యాచ్ రద్దు అయ్యింది. కాగా, సన్‌రైజర్స్ తన తర్వాత మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తోనే గురువారం తలపడనుంది.

Story first published: Tuesday, January 23, 2024, 10:22 [IST]
Other articles published on Jan 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+